ఫ్యాక్ట్ చెక్: భారతీయ రైల్ కు చెందిన గూడ్స్ రైలు గమ్యానికి చేరడానికి మూడేళ్లు పట్టలేదు, వాదన తప్పుదారి పట్టిస్తోంది

భారతీయ రైల్వే ద్వారా దేశంలో కొన్ని లక్షల మంది ప్రతి రోజూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక వస్తువుల రవాణాలో కూడా భారతీయ

Update: 2024-12-11 12:46 GMT

Goods train

భారతీయ రైల్వే ద్వారా దేశంలో కొన్ని లక్షల మంది ప్రతి రోజూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక వస్తువుల రవాణాలో కూడా భారతీయ రైల్వే కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. భారతదేశంలోని ప్రజలు విమానంలో కాకుండా రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. రైలు ప్రయాణం చౌకగా ఉండడమే కాకుండా అందుబాటులో ఉంటుంది. అనేక ప్రయోజనాలతో పాటు, భారతీయ రైల్వేలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. రైళ్లు ఆలస్యంగా రావడం కూడా ఒక ప్రతికూలత. ఆలస్యంగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల సమస్యలు, వాతావరణం, భారీ ట్రాఫిక్, సాంకేతిక లోపాలు, ఇతర సమస్యలు కావచ్చు. ఈ జాప్యాల కారణంగా రైలు ప్రయాణాలు ఆలస్యమవ్వడం 12 నుండి 24 గంటల వరకు విస్తరించవచ్చు.



 


ఇటీవల, అనేక వార్తా వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లలో భారతదేశంలోని ఒక గూడ్స్ రైలు గమ్యాన్ని చేరుకోవడానికి మూడు సంవత్సరాలకు పైగా పట్టిందని తెలిపారు. కొన్ని వార్తా నివేదికలలో ఆలస్యమైన వ్యవధిని 42 గంటలకు బదులుగా 3 సంవత్సరాలు, 8 నెలలు, 7 రోజులుగా పంచుకున్నాయి.

విశాఖపట్నం నుండి బయలుదేరిన గూడ్స్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టిందని వార్తా నివేదికలు తెలిపాయి. 1316 ఎరువుల బస్తాలను తీసుకెళ్తున్న గూడ్స్ రైలు దాదాపు 42 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి పూర్తిచేయాల్సి ఉండగా, ఆ తర్వాత అది మాయమైనట్లు అధికారులు గుర్తించారని వైరల్ పోస్టుల్లో ఉంది.


క్లెయిం కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు. 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది గూడ్స్ రైలు కాదని.. ఒక్క వ్యాగన్ మాత్రమే అని తేలింది.

మేము సంబంధిత కీ వార్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. గూడ్స్ రైలు నుండి ఒక వ్యాగన్ తప్పిపోయిందని, మొత్తం గూడ్స్ రైలు కాదని మేము కనుగొన్నాము. 'ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, '107462' నంబర్ గల వ్యాగన్‌లో ఉన్న వస్తువులు సకాలంలో వారి గమ్యాన్ని చేరుకోవాలి. చివరగా, జూలై 25, 2018 న వ్యాగన్ ను కనుగొన్నారు. ఎట్టకేలకు ఆ గూడ్స్ పెట్టె గమ్యస్థానమైన యూపీ లోని బస్తీకి చేరుకుంది. అయితే అప్పటికే ఎరువులు పాడైపోయాయి.

ఇండియా టీవీ వార్తల ప్రకారం, బస్తీకి చెందిన వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా తన పేరు మీద 2014లో విశాఖపట్నం నుండి ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపిఎల్) ద్వారా ఎరువులను బుక్ చేసుకున్నారు. 14 లక్షలకు పైగా విలువైన వస్తువులతో రైలు షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం నుండి బయలుదేరింది, ట్రిప్ పూర్తి చేయడానికి సాధారణ ప్రయాణ సమయం 42 గంటలు. అయితే అంచనాలకు విరుద్ధంగా రైలు సమయానికి రాలేదు. 2014 నవంబర్‌లో రైలు బస్తీకి చేరుకోకపోవడంతో రామచంద్ర గుప్తా రైల్వే అధికారులను సంప్రదించి అనేక వ్రాతపూర్వక ఫిర్యాదులను సమర్పించారు. పలుమార్లు నోటీసులిచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మార్గమధ్యంలో రైలు బోగీ తప్పిపోయిందని ఆ తర్వాత తెలిసింది.

ఈశాన్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంజయ్ యాదవ్ మాట్లాడుతూ, “కొన్నిసార్లు, ఏదైనా బోగీకి మరమ్మతులు అవసరమైనప్పుడు దాన్ని యార్డుకు పంపుతారు. ఈ బోగీ విషయంలో కూడా అదే జరిగినట్లు అనిపిస్తుంది. " అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ PIB ఫ్యాక్ట్ చెక్ కూడా పోస్ట్ తప్పుదారి పట్టించేలా ఉందని పేర్కొంది.

భారతీయ రైల్వేకు చెందిన ఒక గూడ్స్ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందన్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. గూడ్స్ రైలుకు చెందిన ఒక్క బోగీ మాత్రమే తప్పిపోయింది, మొత్తం రైలు కాదు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now



Claim :  ఒక గూడ్స్ రైలు గమ్యాన్నిచేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News