ఫ్యాక్ట్ చెక్: విమానంద్వారా కెమికల్స్ ను విడుదల చేయలేదని లుఫ్తాన్సా పైలట్ ని ఉద్యోగం నుండి తొలగించలేదు

ఆకాశంలో విమానాలు వెళుతున్నప్పుడు, వాటి వెనుక తెలుపు రంగు pogalu viDudala avvaDam చాలా మందే గమనించి ఉంటారు. ఎగ్జాస్ట్‌లో

Update: 2024-12-14 04:01 GMT

chemtrails

ఆకాశంలో విమానాలు వెళుతున్నప్పుడు, వాటి వెనుక తెలుపు రంగు పొగలు విడుదల అవ్వడం చాలా మందే గమనించి ఉంటారు. ఎగ్జాస్ట్‌లోని నీటి ఆవిరి మంచు స్ఫటికాలుగా ఘనీభవించినప్పుడు జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల వెనుక గీతాల్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మేఘాల తరహాలో ఉంటాయి, వీటిని కాంట్రెయిల్స్ అంటారు. విమానం వేగంగా వెళ్తున్న సయమంలో విమానం ఇంధనం నుంచి వేడి వస్తుంది. అన్ని వేల అడుగుల పైన ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఫలితంగా చుట్టుపక్కల ఉండే చల్లని గాలి అక్కడి వేడి గాలితో కలిసి గడ్డకడుతుంది. అప్పుడే విమానం వెనుక తెల్లని చారలు కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు మారాక ఆ చారలు అదృశ్యమవుతాయి. వాతావరణంలో నీటి పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చారలు ఉంటాయి.

Full View



ఈ చారల వెనుక పలు కారణాలు ఉన్నాయనే ప్రచారం చాలా సంవత్సరాల నుంచీ జరుగుతూ ఉంది. విషపూరిత రసాయనాలను గాలిలో కలుపుతున్నారనీ, ప్రభుత్వాలు విష రసాయనాలను గాల్లోకి వదులుతూ ఉంటారని అందుకే తెల్లని చారలు వస్తున్నాయనీ కూడా పలువురు చెప్పడం మనం చూడొచ్చు. ఈ రసాయనాలు వాతావరణాన్ని విషపూరితం చేయడానికి, లేదా మనుష్యుల మానసిక స్థితి ని కంట్రోల్ చేయడానికీ ఉపయోగిస్తారని కూడా కొందరు నమ్ముతారు, వాతావరణాన్ని నియంత్రించడానికి ఒక మార్గంగా భావిస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇవన్నీ ఎవరికి వారి ఊహాగానాలు మాత్రమే.
వీటన్నిటి మధ్య, కెమ్‌ట్రైల్ సిస్టమ్‌ను ఆన్ చేయడానికి నిరాకరించినందుకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థ తన పైలట్‌ను తొలగించి జర్మనీలోని లేబర్ కోర్టుకు తీసుకెళ్లిందని సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుండి బార్సిలోనాకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ ప్రదేశం క్రూజింగ్ ఎత్తులో ఉన్నప్పుడు కెమ్‌ట్రైల్ స్ప్రే ప్రక్రియకు సంబంధించి స్విచ్‌ ఆన్ చేయడంలో విఫలమైనందుకు పైలట్ క్రిస్టోఫ్ వ్ ను మే 2023లో నోటీసు లేకుండా విధుల నుండి తొలగించారు. తాను 30కి పైగా ఇంట్రా-యూరోపియన్ విమానాల్లో కెమ్‌ట్రైల్ సిస్టమ్‌ను ఆన్ చేయలేదని పైలట్ అంగీకరించాడు. అనేది ఈ పోస్ట్ల సారాంశం.
ఈ పోస్ట్‌లలో జర్మన్ భాషలో ఉన్న వీడియోను చూడొచ్చు .
Full View


Full View


Full View

క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్ట్ లో చెప్పిన కారణం వల్ల లుఫ్తాన్స పైలట్ ను విధుల నుండి తొలగించలేదు, వీడియో ఓ సెటైరికల్ వెబ్‌సైట్ నుండి వచ్చింది.
కెమ్‌ట్రైల్ కుట్ర సిద్ధాంతం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోంది. వాతావరణాన్ని నియంత్రించడానికి లేదా మనుషుల మనస్సును నియంత్రించడానికి ప్రభుత్వ అధికారులు లేదా ఇతర శక్తివంతమైన వ్యక్తులు విమానాల ద్వారా విషపూరిత రసాయనాలను స్ప్రే చేస్తున్నారని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర సిద్ధాంతాలు అనేకసార్లు
డీబంక్ చేశారు.
వీటిలో ఎలాంటి నిజం లేదని నిపుణులు తేల్చిచెప్పారు.
ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల నుండి నీటి ఆవిరితో కూడిన ఎగ్జాస్ట్ వాయువులు ప్రవహించి చల్లని గాలిని తాకినప్పుడు ఏర్పడే మంచు స్ఫటికాలను కాంట్రయిల్స్ అంటారు. ఇవి సాధారణంగా ఉష్ణోగ్రత మైనస్ 35, మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఎత్తులో ఏర్పడతాయి. జర్మన్ ఏరోస్పేస్ సెంటర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ "నేటి కమర్షియల్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ తమ విమాన సమయంలో దాదాపు 20 శాతాన్ని చాలా చల్లగా, తేమగా ఉండే గాలిలో గడుపుతాయి" అని పేర్కొంది.

గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియోను 'డెర్ పోస్టిలో' అనే యూట్యూబ్ ఛానెల్ మొదట ప్రచురించిందని తెలుస్తోంది. ‘Pilot weigerte sich, Chemtrails zu versprühen: Kündigung!’, తెలుగు లో 'పైలట్ కెంట్రెయిల్ స్ప్రే ను చేయడానికి నిరాకరించాడు: ఉద్యోగం కోల్పోయాడు!' అనే టైటిల్ తో వీడియోను వారు పోస్టు చేశారు.

Full View
ఆ వీడియోను అదే తరహాలో వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు.
తదుపరి పరిశోధన తర్వాత, డెర్ పోస్టిలాన్
ఒక వ్యంగ్య వెబ్‌సైట్ అని మేము కనుగొన్నాము. వెబ్‌సైట్ FAQలో, 'పోస్టిలోన్‌లో ఉన్నవన్నీ వ్యంగ్యంగా ఉంటాయి. పచ్చి అబద్దాలు ' అని పేర్కొంది.



 డెర్ ఫొస్తిల్లొన్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన ఇతర వీడియోలను తనిఖీ చేసినప్పుడు, పైలట్‌గా నటించిన అదే వ్యక్తి ఇతర వీడియోలలో ఇతర పాత్రలను పోషిస్తున్నట్లు తెలుసుకున్నాము, దీన్ని బట్టి అతడు నటుడని స్పష్టం అయ్యింది.

Full View
వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ను ఇక్కడ చూడొచ్చు.

వైరల్ వీడియో డెర్ పోస్టిలోన్ అనే వెబ్‌సైట్ ప్రచురించిన వ్యంగ్య వీడియో అని మేము గుర్తించాం. ఇటీవల లుఫ్తాన్సా తమ పైలట్‌ను విధుల్లో నుండి తొలగించిందనే కథనాలు మాకు కనిపించలేదు. వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  కెంట్రెయిల్ స్ప్రేని యాక్టివేట్ చేయడానికి నిరాకరించిన లుఫ్తాన్సా పైలట్ ను ఉద్యోగం నుండి తొలగించారు
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News