ఫ్యాక్ట్ చెక్: యాత్ర-2 సినిమా చూడాలి, చూపించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర-2’. ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న విడుదలైంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. 2019 లో వచ్చిన 'యాత్ర'కి సీక్వెల్ ఈ సినిమా.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర-2’. ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న విడుదలైంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. 2019 లో వచ్చిన 'యాత్ర'కి సీక్వెల్ ఈ సినిమా.
సినిమా విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను ప్రభుత్వ అధికారులు.. ఉద్యోగులు చూడాలంటూ జారీ చేసిన జీఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“GO చూడండి..మన ఖర్మ... కాకపోతే, ప్రభుత్వం సినిమాలు తీయడం ఏంటి...అది చూడండీ..చూపండి..అని IAS, IPS, లాంటి వాళ్ళకి GO లు పంపడం ఏంటి? దానికి half day సెలవు ఇవ్వడం ఏంటి? .......యాత్ర 2 సినిమా ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు తప్పకుండా చూడాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సినిమా...” అంటూ పోస్టులు కొందరు పెడుతూ ఉన్నారు.
'యాత్ర-2' చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారని.. థియేటర్ యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారని వైరల్ పోస్టులో చెబుతున్నారు. ప్రతి గ్రామం/వార్డు వాలంటీర్‌కి ఒక్కో షోకి 10 టిక్కెట్లు కేటాయించేలా.. వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులకు GO లో చెప్పినట్లుగా ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జీవో వచ్చినట్లుగా ఎలాంటి ప్రకటన లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్ ను సెర్చ్ చేయగా.. యాత్ర -2 సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వు లేదు.
జిఓ అంటూ వైరల్ అవుతున్న పోస్టును గమనించగా.. జిఓలో ప్రస్తావించబడిన 'నీలం సాహ్ని' గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా కెఎస్ జవహర్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని మేము కనుగొన్నాము. దీని ద్వారా అది నకిలీ అని నిర్ధారించవచ్చు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన X ఖాతాలో GO వార్తలు ఫేక్ అని.. నీలం సాహ్ని ఆంధ్రప్రదేశ్ సిఎస్ కాదని పేర్కొంటూ ఒక క్లారిటీ ఇచ్చింది.
ఇండియా టుడే కూడా వైరల్ అవుతున్న జిఓ కల్పితమని ధృవీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది.
అందుకే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న ప్రభుత్వ ఉత్తర్వు కల్పితమని మేము ధృవీకరించాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Andhra Pradesh government issued GO mentioning the guidelines to government employees on watching movie ‘Yatra-2’
Claimed By : Social media users
Fact Check : False