ఫ్యాక్ట్ చెక్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్దపులి కనపడలేదు

భారతదేశంలో పులుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో

Update: 2024-11-18 05:07 GMT

Tiger spotted

భారతదేశంలో పులుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 19 వ శతాబ్దం లో భారత దేశం లో సుమారు 40 నుంచి 50 వేల పులులు ఉండేవి, కానీ ఎన్నో కారణాల వల్ల వాటి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. అయితే, 1973 సంవత్సరం లో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ కి నాంది పలికింది. టైగర్ రిజర్వ్‌లు 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా ఏర్పాటు చేసారు, వీటిని భారత ప్రభుత్వ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిర్వహిస్తుంది. టైగర్ రిజర్వ్‌లు జాతీయ ఉద్యానవనం లేదా వన్యప్రాణుల అభయారణ్యం వంటి రక్షిత ప్రాంతాలు, అలాగే బఫర్ ప్రాంతాలూ ఉంటాయి. ప్రాజెక్ట్ టైగర్ కోర్ ఏరియాలో పులుల సంఖ్య పెరగడానికీ, బఫర్ జోన్‌లలో ప్రజలు, జంతువుల మధ్య సమతుల్యతను ప్రోత్సహించడానికి అవసరమైన కార్యాలు ప్రాజెక్ట్ టైగెర్ నిర్వహిస్తుంది. అప్పటినుంచీ టైగర్ రిసర్వ్ లను పెంచుకుంటూ పులుల ను సమ్రక్షించుకుంటూ వస్తున్నాం.

అయినా, సాధారణ ప్రజలకు పులులు కనిపించడం అరుదే. కానీ, పులులు కొన్ని ఊర్లలోకి వచ్చి అక్కడ పరజలకు హాని కలిగించిన సంఘటనలు కూడా ఈ మధ్యకాలం లో కనిపించాయి. అయితే 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో పులులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. 

చిరుతపులులు, పులులు దేశంలోని వివిధ ప్రదేశాలలో కనిపించాయని తప్పుదారి పట్టించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలో పులి కనిపించిందంటూ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఇది స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వాట్సాప్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.

“నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. దీంతో గ్రామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.” అంటూ పలువురు పోస్టులు పెట్టారు.

Full View
Full View
Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో తెలంగాణాది కాదు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా, కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హిమవద్ గోపాలస్వామి బెట్టలో పులి కనిపించిందని కన్నడ టీవీ ఛానెల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించిన అనేక వీడియోలను మేము కనుగొన్నాము. 
న్యూస్18 కన్నడ, టీవీ9 కన్నడ నివేదికలు ఇక్కడ ఉన్నాయి.
Full View
చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా బందీపూర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని హిమవద్ గోపాలస్వామి కొండలో పర్యాటకులకు పులి కనిపించిందని
పబ్లిక్ టీవీలో
కథనం వచ్చింది.
తెలంగాణ అటవీ అధికారులను సంప్రదించగా, తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు ఈ వీడియో తెలంగాణకు చెందినది కాదని ధృవీకరించారు. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న 21 సెకన్ల నిడివి ఉన్న వీడియో తెలంగాణాది కాదంటూ తెలంగాణ టుడేలో కథనం కూడా వచ్చింది. నిర్మల్ ఇన్‌చార్జి జిల్లా అటవీ అధికారి ఎస్‌ఏ నాగిని బాను మాట్లాడుతూ ఈ క్లిప్‌ను ఉత్తరాది రాష్ట్రాలలో చిత్రీకరించి ఉండవచ్చని, తెలంగాణలో కాదన్నారు. వన్యప్రాణుల ఫోటోలు, వీడియో క్లిప్‌లను పంచుకునే ముందు వాస్తవాలను అధికారులతో ధృవీకరించాలని సూచించారు.
కొన్ని వార్తా నివేదికలు ఈ వీడియోను కర్ణాటకకు చెందినవిగా పేర్కొంటూ ప్రచురించినప్పటికీ, ఆ ప్రాంతంలోని అటవీ అధికారుల నుండి సరైన వివరాలను ధృవీకరించలేకపోయాము. వీడియో లొకేషన్‌ను నిర్ధారించడానికి మేము చామరాజనగర్ జిల్లాలోని అధికారులను సంప్రదించాము. మాకు వారి నుండి సమాచారం వచ్చాక ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము.
అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వైరల్ వీడియో నిర్మల్ జిల్లా, తెలంగాణకు సంబంధించినది కాదు. అయితే, అధికారుల సమాచారం ప్రకారం ఈ వీడియో తెలంగాణ కి చెందినది కాదు, ప్రజలు భయాందోళనకు గురి అవాల్సిన అవసరం లేదు. కనుక ఈ వీడియో ఖానాపూర్‌లో చిత్రీకరించలేదని దృవీకరించాం. 
Claim :  తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News