ఫ్యాక్ట్ చెక్: పురుగుల నుండి తీసిన పాలను బిల్ గేట్స్ లాంఛ్ చేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

బిల్ గేట్స్ జంతువుల పాలను భర్తీ చేసే ‘ఎంటో మిల్క్’ అనే కొత్త ఆహారం లాంటి ద్రవ ఉత్పత్తిని ప్రకటించినట్లు కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వెబ్‌సైట్‌లకు సంబంధించిన కొన్ని కథనాలను పంచుకుంటున్నారు.

Update: 2024-08-11 05:00 GMT

Bill Gates

బిల్ గేట్స్ జంతువుల పాలను భర్తీ చేసే ‘ఎంటో మిల్క్’ అనే కొత్త ఆహారం లాంటి ద్రవ ఉత్పత్తిని ప్రకటించినట్లు కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వెబ్‌సైట్‌లకు సంబంధించిన కొన్ని కథనాలను పంచుకుంటున్నారు.


‘నేచురల్ న్యూస్’లో ప్రచురితమైన కథనంలో, ఎంటో మిల్క్ అవసరం ఉంది.. సాంప్రదాయ డైరీ మిల్క్ కారణంగా ఈ భూమి ధ్వంసం అవుతోందని అందులో తెలిపారు.
స్లేన్యూస్‌లోని కథనం ప్రకారం.. గేట్స్ మరియు అతని మిత్రులు ఎంటో మిల్క్ సాంప్రదాయ డైరీ పాలను భర్తీ చేయాలని వాదించారు, ఎందుకంటే వ్యవసాయం గ్రహాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. కీటకాలు ఆహారంక భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే వాటికి చాలా తక్కువ భూమి అవసరం. అవి పశువుల లాగా పర్యావరణానికి హాని కలిగించవు. అవి గ్రీన్‌హౌస్ వాయువులను బయటకు వదలవు. సాధారణ ప్రజలకు ‘ఎంటో పాలు’ ఇవ్వడం వల్ల వాతావరణ మార్పుల నుండి గ్రహాన్ని కాపాడుతుందని భావిస్తున్నారని అందులో పేర్కొన్నారు.

అలెక్స్ జోన్స్ ప్రచురించిన X (ట్విట్టర్) వీడియోను సాక్ష్యంగా పేర్కొన్నారు. ఇన్ఫోవార్స్ అలెక్స్ జోన్స్ ప్రకారం ఈ వీడియో ఎంటో మిల్క్ కోసం ప్రచార వీడియోగా చెప్పారు. "బిల్ గేట్స్ ప్రజలకు మాగ్గోట్ పాలు తినిపించే ప్రాజెక్ట్" అని జోన్స్ ఆ వీడియోలో హెచ్చరించాడు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బిల్ గేట్స్ ఎంటో మిల్క్ లేదా మాగోట్ మిల్క్ నుండి డెవలప్ చేసిన ఉత్పత్తిలో భాగమైనట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
అలెక్స్ జోన్స్ షేర్ చేసిన వీడియోలో షేర్ చేసిన క్లిప్‌లు సెప్టెంబర్ 2018లో 60 సెకండ్ డాక్స్ ప్రచురించిన వీడియో నుండి తీసుకున్నారు. వీడియో వివరణలో 'ఎంటో మిల్క్, బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా నుండి తయారైన డైరీ ప్రత్యామ్నాయ బగ్ మిల్క్ అని.. ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయని అందులో ఉంది. కొవ్వు, కాల్షియం, ఇనుము, జింక్ కూడా ఉంది. కేప్ టౌన్‌లో దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు-- ఈ పదార్ధంతో ప్రయోగాలు చేసి, కీటకాల ఐస్ క్రీం, ఇతర ఆహారాలుగా మార్చొచ్చు. ప్రపంచ జనాభా పరిమాణం పెరుగుతున్నందున, మరింత స్థిరమైన పరిష్కారాలను పరిగణించాలని చాలా మంది నమ్ముతారు. పెరుగుతున్న ప్రపంచానికి ఆహారం ఇవ్వడానికి కీటకాలు కీలక పాత్ర పోషిస్తాయని అందులో తెలిపారు.
Full View
ఎంటో మిల్క్ అనేది 'లెహ్ బెస్సాచే' స్థాపించిన దక్షిణాఫ్రికా కంపెనీ గౌర్మెట్ గ్రబ్ ఉత్పత్తి. ఎంటో మిల్క్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉన్న మంచి పదార్థమని, పిండి పదార్థాలు లేని పర్యావరణ అనుకూలమైనదిగా తెలిపారు.
మేము Leah Bessa గురించి మరింత సమాచారం కోసం వెతికాం. Leah Bessa 26 ఏళ్ల ఆవిష్కర్త అని ఒక కథనాన్ని కనుగొన్నాము. సహజమైన ఆహారాన్ని రూపొందించడంలో కొత్త పంథాను నమ్ముకుంది లియా బెస్సా. లేహ్ MSc ఫుడ్ సైన్స్‌లోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయంలో 2016లో తన చదువును పూర్తి చేసింది. ప్రస్తుతం కేప్ టౌన్‌లో ఉంది. బెస్సా, ఆమె బృందం సహజంగా లాక్టోస్ లేని ఐస్‌క్రీమ్‌ను సృష్టించడం కోసం కీటకాల వినియోగం వైపు మొగ్గు చూపారు. ఈ ఉత్పత్తి ఎంటో మిల్క్ నుండి తయారు చేశారు. ఇది కీటకాలతో తయారైన ఒక రకమైన పాల ప్రత్యామ్నాయం. దక్షిణాఫ్రికాలో కీటకాల భవిష్యత్తు గురించి కూడా లేహ్ దృష్టి పెట్టింది. కీటకాల వినియోగాలపై మార్పులు తీసుకుని రావాలని.. అలాగే ప్రజల్లో ఉన్న అపోహలను పారద్రోలాలని కూడా భావిస్తున్నట్లు తెలిపింది.
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్ లో కూడా ఎంటో మిల్క్ గురించి పేర్కొనలేదు. డెయిరీ మిల్క్‌కు ప్రత్యామ్నాయంగా కీటకాలతో పాలను బిల్ గేట్స్ ప్రవేశపెడుతున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  బిల్ గేట్స్ డైరీ మిల్క్ స్థానంలో 'ఎంటో మిల్క్' అనే పురుగుల నుండి తీసిన పాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.
Claimed By :  Social media and website articles
Fact Check :  False
Tags:    

Similar News