ఫ్యాక్ట్ చెక్: భారీ పక్షి ఎగరడం మర్చిపోయిందా..?

చాలా సంవత్సరాల పాటూ ఆ పక్షిని జూలో ఉంచారు. ఆ తర్వాత పక్షిని విడుదల చేయడంతో ఎగరేకపోయిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. పంజరంలో ఉన్న పక్షి విడుదలచేస్తే.. ఎగరడం మరిచిపోయిందని పలువురు తెలిపారు. ఒక పెద్ద పక్షి తన రెక్కలను విరిచి.. కొండ అంచున ఉండగా దాని చుట్టూ ఎంతో మంది గుమికూడిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది.

Update: 2022-11-04 11:16 GMT

చాలా సంవత్సరాల పాటూ ఆ పక్షిని జూలో ఉంచారు. ఆ తర్వాత పక్షిని విడుదల చేయడంతో ఎగరేకపోయిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. పంజరంలో ఉన్న పక్షి విడుదలచేస్తే.. ఎగరడం మరిచిపోయిందని పలువురు తెలిపారు. ఒక పెద్ద పక్షి తన రెక్కలను విరిచి.. కొండ అంచున ఉండగా దాని చుట్టూ ఎంతో మంది గుమికూడిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది.

ఫ్యాక్ట్ చెకింగ్:

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వీడియో Dodo అనే సైట్ లో చూశాము. జులై 9, 2018 న 'Giant Condor Stops To 'Thank' Rescuers Before Returning To Wild' అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

ఆర్టికల్ ప్రకారం.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న పక్షిని అండీన్ కాండోర్(Andean condor) అని గుర్తించారు. ఆ పక్షికి సయాని అనే పేరు పెట్టారు. 2014లో చికిత్స తర్వాత అర్జెంటీనాలోని జంతు సంరక్షకులు దానిని విడిపించారు. 'సయాని' 2012లో కాటమార్కా (అర్జెంటీనా)లో ఆ ప్రాంతంలోని విషప్రయోగానికి గురైంది. అది చనిపోయే స్థితిలో కనుగొన్నారు. దానికి కావాల్సిన చికిత్స అందించి.. ఆ తర్వాత దానిని విడిచిపెట్టారు.

అదే సంఘటనను వివరిస్తూ మరొక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. 'సయాని' కి సంబంధించిన వీడియో నిడివి ఎక్కువ ఉన్న సంస్కరణను మేము కనుగొన్నాము. వీడియోలో 4:25కి సజావుగా ఎగురుతున్నట్లు చూడవచ్చు.
Full View

మేము సంబంధిత కీ వర్డ్స్ తో ఇంటర్నెట్‌లో శోధించాము. సెప్టెంబర్ 6, 2018న La Nacion అప్‌లోడ్ చేయబడిన వెబ్‌సైట్‌లో నివేదికను కనుగొన్నాము 'A rescued condor thanks those who healed him before regaining his freedom' అని అందులో ఉంది.

నివేదిక ప్రకారం, అంబటోలో కనుగొనబడిన మగ పక్షిని బ్యూనస్ ఎయిర్స్ జూకు తరలించారు. ఆండియన్ కాండోర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా, 139 పక్షులను దక్షిణ అమెరికాలో తిరిగి విజయవంతంగా అడవుల్లోకి వదిలారు.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  A bird caged for a long time has forgotten to fly
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News