ఫ్యాక్ట్ చెక్: అరుదైన పక్షులను చూపుతున్న వీడియో ఏఐ ద్వారా సృష్టించారు
ప్రకృతి సమతుల్యతలో పక్షులు కీలక పాత్ర పోషిస్తాయి. జీవ మనుగడకు పక్షులు ఎంతో ఉపకారం చేస్తాయి. ఇక చలికాలంలో ఎన్నో పక్షులు
By - Satya Priya BNUpdate: 2024-11-19 04:49 GMT
ప్రకృతి సమతుల్యతలో పక్షులు కీలక పాత్ర పోషిస్తాయి. జీవ మనుగడకు పక్షులు ఎంతో ఉపకారం చేస్తాయి. ఇక చలికాలంలో ఎన్నో పక్షులు భారతదేశానికి వలస వస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలకు సైబీరియా నుండి తరలి వస్తూ ఉంటాయి. సైబీరియా ఉష్ణ ప్రాంతంగా ఉండడంతో ఈ చలికాలంలో ఏపీకి వస్తాయి. సుమారు 4500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు చాలా పక్షులు ఇక్కడే ఉంటాయి. గుడ్లు పెట్టి పొదిగి ఆ పిల్లలు ఎగిరిన తర్వాత తిరిగి సైబీరియాకు వలస వెళ్తాయి. కొన్ని గ్రామాలు ఈ పక్షుల కారణంగా పర్యాటక ప్రాంతాలుగా మారాయి కూడానూ!!
ఇతర జీవుల ఆరోగ్యంపై కూడా పక్షుల మనుగడ ప్రభావం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆహార ఉత్పత్తి మొదలైనవాటిని ప్రభావితం చేసే పర్యావరణ వ్యవస్థల పనితీరులో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భూమిపై మిలియన్ల కొద్దీ పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ అంతరించిపోతున్నాయి.
ఒక్కో రకమైన పక్షులకు.. ఒక్కో రకమైన శరీర భాగాలు ఉంటాయి. ఇవి ఈకలతో కప్పబడి ఉంటాయి, ఇవి ఎగిరే సమయంలో గాలికి నిరోధకతను తగ్గిస్తాయి. కొన్ని పక్షులకు రెక్కలు ఉన్నా.. అవి ఎగరలేవనుకోండి. కొన్ని పక్షులు అలా ఎగురుతూ ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పక్షులకు అద్భుతమైన రంగులు, నమూనాలు, ప్రవర్తనలను కలిగి ఉంటాయి. అలాంటి అనేక పక్షులు భూమిపై ఉన్నాయి.
చెట్టు కొమ్మపై ఉన్న రెండు అందమైన రంగురంగుల పక్షుల వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ పక్షుల తల మీద టోపీలను చూడొచ్చు. మరిన్ని అరుదైన లక్షణాలతో ఉన్న ఈ పక్షులు ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉన్నాయి. వాటి ఈకలపై పూసలను మనం చూడవచ్చు. ముక్కు, మెడపై వెండితో అలంకరణలు ఉన్నాయి. ఈ వీడియో కింద ‘అద్భుతమైన జపనీస్ పక్షులు’ అనే క్యాప్షన్‌లతో ప్రచారం చేస్తున్నారు. వీటికి 'పజారోస్ జపోనెస్' అనే పేరుతో పిలుస్తారని పలువురు షేర్ చేస్తున్నారు.
‘అరుదైన పక్షులు’ అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను AI ద్వారా రూపొందించారు. వీడియోలో కనిపించే పక్షులు ప్రకృతిలో అసలు కనిపించవు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేసినప్పుడు.. సైన్స్ గర్ల్ అనే ఖాతా ద్వారా “ఒక రాజు అతని రాణి” అనే శీర్షికతో భాగస్వామ్యం చేసిన X పోస్ట్‌ని మేము కనుగొన్నాము. నవంబర్ 5, 2024న అదే వీడియోను భాగస్వామ్యం చేసిన Zhang Nuonuo అనే పేరు గల మరో X ఖాతా లో కూడా చూసాం. కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, మేము వీడియో AI ద్వారా రూపొందించారని నిర్ధారించాము.
AI-జనరేటెడ్ క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్న మరికొందరు X వినియోగదారుల పోస్టులను కూడా మనం చూడొచ్చు
మేము హైవ్ మోడరేషన్ AI డిటెక్షన్ టూల్‌ని ఉపయోగించి వీడియోని పరిశీలించినప్పుడు వీడియో డీప్‌ఫేక్ లేదా AI-జెనరేట్ అయ్యే అవకాశం 98.4% ఉందని కనుగొన్నాము. ai_generated, stable diffusion లో ఏఐ ద్వారా సృష్టించారని మేము కాన్ఫిడెన్స్ స్కోర్‌ని చూసాం. ai_generatedపై స్కోర్ 0.98 కాగా.. stable diffusion స్కోరు 0.95.
మేము మరింత శోధించినప్పుడు, అందమైన పక్షులు, అరుదైన పక్షులు మొదలైన క్యాప్షన్‌లతో వైరల్ వీడియోలో పక్షుల మాదిరిగానే కనిపించే పక్షుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొన్ని ఏఐ వీడియోలను మేము కనుగొన్నాము.
Full ViewFull ViewFull Viewకాబట్టి, వైరల్ వీడియోలో ఉన్నవి జపాన్ కు చెందిన నిజమైన అరుదైన పక్షులు కావు. AI సాంకేతికతతో వీడియోను రూపొందించారు. ఈ రంగురంగుల పక్షులు జపాన్ లో ఉంటాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అరుదైన రంగుల జపనీస్ పక్షుల జంటకు సంబంధించిన వీడియో ఇది
Claimed By : Social media users
Fact Check : False