ఫ్యాక్ట్ చెక్: ఎన్సీపీ నేత సుప్రియా సూలే వైరల్ ఆడియోను ఏఐ ద్వారా రూపొందించారు.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది, రాష్ట్రంలో అధికారం కోసం అధికార మహాయుతి, ప్రతి పక్ష మహా

Update: 2024-11-20 11:21 GMT

Supriya Sule audio clip

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది, రాష్ట్రంలో అధికారం కోసం అధికార మహాయుతి, ప్రతి పక్ష మహా వికాస్ అఘాడి పోటీ పడుతున్నాయి. ముఖ్య నేతలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్, NCP నాయకులు సుప్రియా సూలే, అజిత్ పవార్, పలువురు బాలీవుడ్ తారలు, క్రికెటర్లు ఎన్నికలలో ఓటు వినియోగించారు.

ఇంతలో ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే, గౌరవ్ మెహతా అనే వ్యక్తికి మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లు వాయిస్ క్లిప్‌తో కూడిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆంగ్లంలో వాయిస్ క్లిప్, సారథి అసోసియేట్స్ సహచరుడు గౌరవ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడ గొంతు వినిపించింది. అవతలి వ్యక్తి కాల్స్‌కు ఎందుకు స్పందించడం లేదని స్వరం వినొచ్చు. అన్ని బిట్‌కాయిన్‌లను క్యాష్ చేసుకోవాలని కూడా పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తున్నందున, నగదు చాలా అవసరం. బిట్‌కాయిన్‌లను క్యాష్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. తాము అధికారంలోకి వస్తామని కంగారు ప‌డ‌డం అవసరం లేదని వినొచ్చు. ఈ వాయిస్ క్లిప్ లోని వాయిస్ ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే దే అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పలువురు ఎక్స్ వినియోగదారులు “These are 3 voice notes between @PawarSpeaks daughter @supriya_sule and Gaurav Gupta. #MaharashtraElection2024 #MAVCorruptionProof #Maharashtra The entire #INDIalliance block is dealing it's corrupt money through Bitcoins. #MaharashtraElection2024 #MAVCorruptionProof #Maharashtra” అంటూ పోస్టులు పెట్టారు.



బీజేపీ తెలంగాణ హ్యాండిల్ కూడా వైరల్ పోస్ట్‌ను షేర్ చేసింది.

క్లెయిం కు చెందిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆడియోలో వినిపించిన వాయిస్ AI రూపొందించిన ఆడియో క్లిప్.

ఈ సంఘటన గురించి ఏవైనా వార్తా నివేదికల కోసం శోధించినప్పుడు, NCP నాయకురాలు బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందనే ఆరోపణలను కొట్టిపారేసిన నివేదికలను మేము కనుగొన్నాము. సుప్రియ స్పందిస్తూ, ఆడియో కల్పితమని తెలిపారు. "నేను బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. వాటి వలన తీవ్రమైన సమస్యలు వస్తాయని వాదించిన వ్యక్తిని" అని ఆమె స్పష్టం చేశారు. 
ఇండియా టుడే
ప్రచురించిన వీడియో ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది, ఇందులో ఆమె వైరల్ అవుతున్న వాదనలను కొట్టిపారేయడాన్ని మనం వినవచ్చు. 

ఏ ఎన్ ఐ వారు షేర్ చేసిన వీడియో ను కూడా ఇక్కడ చూడొచ్చు


ఇన్‌విడ్ వెరిఫికేషన్ టూల్‌లో పొందుపరిచిన వాయిస్ వెరిఫికేషన్ టూల్ హియాను ఉపయోగించి మేము ఆడియోని చెక్ చేసినప్పుడు, ఆడియో AI-జెనరేట్ చేసినట్లు కనుగొన్నాం. వాయిస్ క్లిప్ AI ద్వారా రూపొందించారంటూ 98% ఖచ్చితంగా ఉందని తెలిపారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారి లిట్ హౌస్ జర్నలిజం ఫ్యక్ట్ చెక్ సంస్థ కూడా ఈ వాదన ను అబద్దం అని నిరూపించింది. కనుక, వైరల్‌ పోస్ట్‌లలో వినిపిస్తున్న వాయిస్ ఎన్‌సీపీ నేత సుప్రియా సూలేది కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వాయిస్. మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు నగదు లావాదేవీల కోసం సుప్రియా సూలే బిట్‌కాయిన్‌లను అక్రమంగా ఉపయోగిస్తున్నారనే వాదన అవాస్తవం.

Claim :  మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బులు పంచడానికి సుప్రియా సూలే బిట్‌కాయిన్లను అక్రమంగా ఉపయోగిస్తున్నారు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News