ఫ్యాక్ట్ చెక్: పాట్నాలో పుష్ప-2 ఈవెంట్ విజువల్స్, ముంబైలో MVA బహిరంగ సభకి చెందినవి గా వైరల్ అవుతున్నాయి

మహారాష్ట్రలో నవంబర్ 20, 2024న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాలు, జార్ఖండ్‌లోని

Update: 2024-11-20 07:13 GMT

MVA rally 

మహారాష్ట్రలో నవంబర్ 20, 2024న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాలు, జార్ఖండ్‌లోని కొన్ని నియోజక వర్గాలకు ఆ రోజునే జరగనున్నాయి. మహా వికాస్ అయుతి (ఎంవిఎ) కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల రోజున ముంబైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర నగరాల్లో డ్రై డే పాటిస్తారు.

ఇక ముంబైలోని BKC స్టేడియంలో నిర్వహించిన MVA బహిరంగ సభకు సంబంధించిన వీడియో అంటూ.. బహిరంగ ప్రాంతంలో భారీగా జనాన్ని చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. “𝐂𝐫𝐨𝐰𝐝 𝐭𝐡𝐫𝐨𝐧𝐠 𝐌𝐕𝐀 𝐫𝐚𝐥𝐥𝐲 𝐚𝐭 𝐁𝐊𝐂 𝐢𝐧 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 | Overview of the meeting recorded by drone” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.



క్లెయిం కు చెందిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ వీడియోకు మహారాష్ట్రలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. ముంబైలోని BKC ప్రాంతంలో MVA బహిరంగ సభకు సంబంధించిన డ్రోన్ షాట్ అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ముందుగా, ముంబైలోని BKC వద్ద MVA ర్యాలీ/సభకు సంబంధించిన విజువల్స్ కోసం శోధించినప్పుడు, ఆ విజువల్స్‌ను పంచుకునే X పోస్ట్‌ మాకు లభించింది. వైరల్ వీడియో విజువల్స్‌తో ఈ విజువల్స్ సరిపోలడం లేదు.
 వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. డ్రోన్ వీడియో MVA ర్యాలీకి సంబంధించినది కాదని మేము కనుగొన్నాము. ఇది బీహార్‌లోని పాట్నాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఈవెంట్ అని చూపుతుంది. తెలుగుపోస్ట్ టీమ్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌
లో ప్రచురించిన కథనాన్ని కనుగొంది, ఆ ఈవెంట్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను భాగస్వామ్యం చేసింది. గాంధీ మైదాన్‌లో వేలాది మంది అభిమానులు హాజరైన ఈవెంట్ భారీ సక్సెస్ ను అందుకుందని కథనంలో తెలిపారు.
‘Huge Crowd at Pushpa 2 The Rule Trailer launch event’ అనే టైటిల్ తో జీ తెలుగు న్యూస్‌లో ప్రచురించిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో వైరల్ వీడియోలో కనిపించే విధంగా ప్రజలు ఎత్తైన నిర్మాణంపైకి ఎక్కడాన్ని మనం చూడవచ్చు.
Full View
ఇండియా టుడే కథనం ప్రకారం, ట్రైలర్ లాంచ్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగింది. నిర్వాహకులు ఈవెంట్‌కు పాస్‌లను అందించారు, అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొన్ని గేట్స్ వద్ద ప్రజలను నియంత్రించలేకపోయారు. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.
పుష్ప 2: ది రూల్ ట్రైలర్ ఈవెంట్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్నలను చూసేందుకు ఎగబడిన జనాన్ని నియంత్రించడానికి భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారని ANI నివేదించింది.
మరో ANI వీడియోలో ప్రజలు ఈవెంట్ సమయంలో నిర్మించిన నిర్మాణాలపైకి ఎక్కినట్లు చూపిస్తుంది.
ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్, వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. వైరల్ వీడియో ముంబైలోని BKCలో MVA బహిరంగ సభను చూపించలేదు, అందులో ఉన్నది పుష్ప 2 ది రూల్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కు వచ్చిన జనం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ముంబైలోని BKC ప్రాంతంలో MVA బహిరంగ సభకు సంబంధించిన విజువల్స్
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News