ఫ్యాక్ట్ చెక్: నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేరు

నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. శాంతిని పెంపొందించడంలోనూ, వివాదాలను పరిష్కరించడంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను ఇది వరిస్తుంది. నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును చాలా మంది అనేకసార్లు సిఫార్సు చేశారు.

Update: 2023-03-27 09:43 GMT
నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. శాంతిని పెంపొందించడంలోనూ, వివాదాలను పరిష్కరించడంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను ఇది వరిస్తుంది. నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును చాలా మంది అనేకసార్లు సిఫార్సు చేశారు.ఇటీవల, నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అతిపెద్ద పోటీదారు అని నోబెల్ బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ ప్రకటించినట్లు అనేక మీడియా సంస్థలతో పాటు అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ వార్తా నివేదికలను ప్రచురించాయి. ప్రధాని మోదీ నిరంతరం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారు, ప్రపంచ శాంతిని పునరుద్ధరించగల సామర్థ్యాన్ని ఆయన కలిగి ఉన్నారంటూ కథనాలు వచ్చాయి.
Full View
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.IFF, నార్వేజియన్ నోబెల్ కమిటీ సహ-అధ్యక్షుడు డాక్టర్ అస్లే టోజే మార్చి 14, 2023న “Alternative development Model and Peace” అనే రౌండ్‌టేబుల్ చర్చలో పాల్గొన్నారు. ఇండియా సెంటర్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
tatsatchronicle.com
ప్రకారం.. డాక్టర్ టోజే మాట్లాడుతూ శాంతికి ప్రాధాన్యతనిస్తూ సామాజిక ఆర్థిక వృద్ధికి కొత్త విధానాలను అవలంబించాలని ఉద్ఘాటించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి స్థిరమైన వృద్ధిని పెంపొందించడానికి తీసుకునే చర్యలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తన ప్రసంగంలో నార్వేజియన్ నోబెల్ కమిటీలో సభ్యుడిగా ఉండటం ఒక గౌరవమని, అది చాలా కష్టమైన పని అని టోజే అన్నారు. భారత్‌కు వచ్చాక తాను ఎంతో నేర్చుకున్నానని, ప్రపంచ రాజకీయాల్లో భారతదేశానికి ప్రాధాన్యం పెరుగుతోందని అన్నారు.

Full View

ఎబిపి న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశం సూపర్ పవర్‌గా మారడం ఖాయమని.. తాను ప్రధాని మోదీని అనుసరిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రపంచంలోని ప్రతి నాయకుడు శాంతి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మోదీ వంటి శక్తివంతమైన నాయకులకు అవకాశాలు, సామర్థ్యం చాలానే ఉన్నాయని అన్నారు.ANIతో మాట్లాడుతూ "ఇది యుద్ధాలకు యుగం కాదు" అని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను డాక్టర్ టోజే ప్రశంసించారు.ఈ ఇంటర్వ్యూలలో దేనిలోనూ, నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ప్రధాని మోదీ ఉన్నారని ఆయన ఎలాంటి ప్రకటన చేయడం మాకు కనిపించలేదు.
ఏఎన్‌ఐకి ఇచ్చిన ఒక ప్రకటనలో, ఆయన వైరల్ అవుతున్న ప్రకటనను ఖండించారు. "నేను నోబెల్ కమిటీకి డిప్యూటీ లీడర్‌ని. ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇవన్నీ ఫేక్ న్యూస్‌గా పరిగణించాలని నేను భావిస్తున్నాను. ఫేక్ వార్తల గురించి చర్చించకూడదు. వైరల్ అవుతున్న ట్వీట్‌లో ఉన్నదాని గురించి నేను చెప్పలేదు.. దాన్ని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను." అని అన్నారు.
అందువల్ల, నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని మోదీ పెద్ద పోటీదారు అని డాక్టర్ అస్లే టోజే చేసిన వాదన తప్పు. ఆయన అలాంటి ప్రకటన చేయలేదు.
Claim :  Deputy leader of Nobel committee claims PM Modi is peace prize contender
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News