ఫ్యాక్ట్ చెక్: నటి సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి పెళ్లి చేసుకోలేదు

నటి సాయి పల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్;

Update: 2023-09-23 15:01 GMT
SaiPallavi, ActressSaiPallavi, SaiPallaviMarriage, SaipallaviWedding, RajkumarPeriyaSwamy,
  • whatsapp icon

నటి సాయి పల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలో ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో మెడలో దండలు ధరించి కనిపించారు. ఫేస్‌బుక్, ఎక్స్‌లోని చాలా మంది వినియోగదారులు ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

Full View



ఫ్యాక్ట్ చెకింగ్:
శివకార్తికేయన్‌ హీరోగా.. సాయి పల్లవి ఓ సినిమా చేస్తోంది. ఆ చిత్రం SK21 ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఫోటోను తీశారు. ఈ చిత్రం రాజ్‌కుమార్, శివకార్తికేయన్‌ల సినిమా పూజా కార్యక్రమాల సమయంలో తీశారు. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు 'SK 21' అని పేరు పెట్టారు. ఒరిజినల్ ఫోటోలో రాజ్‌కుమార్ క్లాప్‌బోర్డ్‌ను పట్టుకున్నారు. ఆయన పక్కన సాయి పల్లవి నిలబడి ఉంది.

రెండు ఫోటోల మధ్య తేడాలను మీరు గమనించవచ్చు.



 


మే 9 న, దర్శకుడు రాజ్‌కుమార్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పూజా కార్యక్రమంలోని కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.


తనకు పెళ్లి జరిగింది అంటూ వైరల్ అవుతున్న ఫోటోలపై సాయి పల్లవి స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే, రూమర్స్‌ను నేను అసలు పట్టించుకోను. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను నటించిన ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్‌ చేసి, డబ్బు కోసం, నీచమైన ఉద్దేశాలతో వాటిని ప్రచారం చేస్తున్నారు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సాయి పల్లవి.


రాజ్‌కుమార్ పెరియసామి, సాయి పల్లవి నిజంగా వివాహం చేసుకున్నారని వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు.
నటి సాయి పల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి పెళ్లి చేసుకున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.


Claim :  Actress Sai Pallavi and director Rajkumar Periyasamy are married
Claimed By :  Social media
Fact Check :  False
Tags:    

Similar News