ఫ్యాక్ట్ చెక్: ఒడిశా ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించనుంది

Update: 2024-06-20 02:59 GMT

ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆమోదంతో అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టారు. సీఎం మాఝీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే జర్నలిస్టులను లోక్‌సేబా భవన్‌ లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు సంవత్సరాల క్రితం, నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జర్నలిస్టులను లోక్‌సేబా భవన్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది.

అదే రోజు సాయంత్రం మోహన్ మాఝీ తన మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. బ్రీఫింగ్ సందర్భంగా, కొన్ని సంవత్సరాల క్రితం మూసివేసిన శ్రీ మందిర్ నాలుగు తలుపులను జూన్ 13, 2024 ఉదయం నుండి తిరిగి తెరవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రజాసేవకే అంకితమై, ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పాటుపడతామని ఒడిశా కొత్త ముఖ్యమంత్రి అన్నారు.
ఈ నేపథ్యంలో టీవీ న్యూస్ స్క్రీన్‌షాట్‌లా ఉన్న ఓ గ్రాఫిక్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ଓଡ଼ିଶାରେ ଦେଶୀ ବିଦେଶୀ ମଦ ବନ୍ଦ, ଓଡ଼ିଶା ସରକାରର ବଡ଼ ନିଷ୍ପତ୍ତି ସ୍ୱାଧୀନତା ଦିବସ ଠାରୁ ଓଡ଼ିଶାରେ ମଦ ବନ୍ଦ I అంటూ ఒడియా టెక్స్ట్ లో కథనం వైరల్ అయింది.
“ఒడిశాలో అన్ని రకాల మద్యాన్ని నిషేధిస్తాం. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ఒడిశాలో అన్ని రకాల మద్యాన్ని నిషేధిస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది." అని అందులో ఉంది.
గ్రాఫిక్ ఇమేజ్‌లో 'న్యూస్18' మీడియా సంస్థకు సంబంధించిన లోగోతో పాటు కొత్త ముఖ్యమంత్రి ఫోటోలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో గ్రాఫిక్‌ను షేర్ చేస్తున్నారు. "మోహన్ ప్రభుత్వం ద్వారా మరో మాస్టర్‌స్ట్రోక్." అంటూ పోస్టులు పెట్టారు.


Full View



Full View


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మద్యపాన నిషేధం అంటూ న్యూస్18 కూడా అలాంటి వార్తను ప్రచురించలేదు.
నిశితంగా పరిశీలించిన తర్వాత, వైరల్ ఇమేజ్‌లోని న్యూస్18 ఒడియా లోగో కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది.
ఒడిశా ముఖ్యమంత్రి అధికారిక సైట్‌లో వెతికినా మద్యపాన నిషేధానికి సంబంధిత నోటిఫికేషన్‌లు రాలేదు. ఒడిశా ఎక్సైజ్ శాఖ వారి వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎలాంటి నోటిఫికేషన్‌లను విడుదల చేయలేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అదే గ్రాఫిక్‌ను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. దానిపై "ఫేక్" అనే స్టిక్కర్ ఉంది.
“ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହେଉଥିବା ଏହିଭଳି ଫେକ୍ ନ୍ୟୁଜ୍ ପ୍ରତି ସଚେତନ ରୁହନ୍ତୁ। ସବୁବେଳେ ସରକାରୀ ସୂତ୍ରରୁ ପ୍ରଦତ୍ତ ତଥ୍ୟ ଉପରେ ଗୁରୁତ୍ବ ଦିଅନ୍ତୁ। ଏହିଭଳି ମିଥ୍ୟାଗୁଜବ ପ୍ରସାରଣରୁ ନିବୃତ୍ତ ରୁହନ୍ତୁ। ଏହା ବେଆଇନ ଅଟେ” । అంటూ వివరణ ఇచ్చారు.
“సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. అధికారిక మూలాల ద్వారా వచ్చే సమాచారంపై మాత్రమే దృష్టి పెట్టండి. దయచేసి ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం మానుకోండి. ఇది చట్టవిరుద్ధం." అంటూ తెలియజేశారు.
న్యూస్18 ఒడియా తమ సోషల్ మీడియాలో తాము ఈ కథనాన్ని ప్రసారం చేయలేదని ప్రకటించింది. “మద్యం అమ్మకాలను ఒడిశాలో నిలిపివేస్తున్నట్లు వైరల్ అవుతున్నది ఓ ఫేక్ న్యూస్, న్యూస్ 18 ఒడియా అలాంటి కథనాన్ని ప్రసారం చేయలేదు” అనే శీర్షికతో ఒక పోస్ట్‌ను షేర్ చేసినట్లు మేము కనుగొన్నామని తెలిపింది.


న్యూస్18 ఒడియా కరస్పాండెంట్ దీపక్ కుమార్ సమల్ కూడా వైరల్ పోస్టుపై వివరణ ఇచ్చారు. “ఈ రకమైన వైరల్ ఇమేజ్ పట్ల జాగ్రత్తగా ఉండండి” అని తెలిపారు. న్యూస్18 ఒడియా లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.


ఒడిషా టీవీ కూడా "ఒడిషాలో మద్యపాన నిషేధం లేదు, I & PR డిపార్ట్‌మెంట్ ఫేక్ న్యూస్‌ను ఖండించింది" అనే శీర్షికతో ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.
కళింగ టీవీ కూడా రాష్ట్రంలో మద్య నిషేధంపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతోందని స్పష్టం చేసింది.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధాన్ని ప్రకటించలేదు.. న్యూస్ 18 ఒడియా కూడా ఈ విషయంపై ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు.


Claim :  ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించనుంది
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News