ఫ్యాక్ట్ చెక్: NDA మీట్‌లో మోదీ వచ్చినప్పుడు నితిన్ గడ్కరీ నిలబడలేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు

నితిన్ గడ్కరీ లేచి మోదీకి మద్దతు తెలపలేదు

Update: 2024-06-25 03:07 GMT

న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ) కూటమి నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి తమ మద్దతును ఇవ్వడం.. ఆయనను ఎన్‌డిఏ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగిపోయాయి. ఆయన దేశ ప్రధానిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయనను ప్రధానిగా ఎన్నుకోవడం బీజేపీ నేతలకే ఇష్టం లేదంటూ కొందరు కొన్ని వీడియోలను వైరల్ చేస్తున్నారు.


కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ నిలబడి మోదీని అభినందించలేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.

సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తూ “నితిన్ గడ్కరీ లేచి నిలబడి మోదీని అభినందించడానికి ఎలా నిరాకరించారో చూడండి.” అంటూ పోస్టులు పెట్టారు.



ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాం.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోను ఎడిట్ చేసి తప్పుడు కథనంతో షేర్ చేశారు. అసలు వీడియోలో, నితిన్ గడ్కరీ నరేంద్ర మోదీని అభినందించడానికి లేచి నిలబడ్డారు. అంతేకాకుండా NDA పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోదీకి మద్దతునిచ్చారు.
మా పరిశోధనలో ANI ద్వారా అప్‌లోడ్ చేసిన ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియోను మేము కనుగొన్నాము. 26:00 టైమ్‌స్టాంప్ వద్ద, నరేంద్ర మోదీ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, నితిన్ గడ్కరీ నిలబడి చప్పట్లు కొట్టడం కనిపించింది.


Full View


26:55 టైమ్‌స్టాంప్ వద్ద, మేము మోదీ, నితిన్ గడ్కరీ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం కూడా గమనించాము.


Full View



నరేంద్ర మోదీ మీటింగ్‌లోకి ప్రవేశించిన తర్వాత, అందరూ తమ సీటులోనే కూర్చున్నారు. అయితే J.P. నడ్డా మోదీని సత్కరిస్తారని ప్రకటించడంతో వారు మళ్లీ నిలబడ్డారు.

27:56 టైమ్‌స్టాంప్ వద్ద, నితిన్ గడ్కరీ ఇతర నేతలతో కలిసి మోదీకి అభినందనలు తెలిపారు.

Full View


48:56 టైమ్‌స్టాంప్‌లో, నరేంద్ర మోదీని ఎన్‌డిఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గడ్కరీ తన మద్దతును అందిస్తున్నట్లు చూడొచ్చు.
ఒక ట్విటర్ వినియోగదారుడు నిజం ఇదే అంటూ ఒక చిన్న క్లిప్‌ను అప్‌లోడ్ చేశారు. అందులో నితిన్ గడ్కరీ లేచి నిలబడడం మనం చూడొచ్చు.


జెహ్లామ్ టైమ్స్ “NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గడ్కరీ మద్దతు తెలిపారు” అంటూ ఓ కథనాన్ని మేము గుర్తించాం.
ANI జూన్ 7, 2024న “NDA పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీని నియమించే ప్రతిపాదనకు నితిన్ గడ్కరీ మద్దతు” అనే శీర్షికతో ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మా దర్యాప్తు, వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఒరిజినల్ వీడియోలో నితిన్ గడ్కరీ మోదీని అభినందించడానికి నిలబడటమే కాకుండా NDA పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మద్దతు కూడా ఇచ్చారు.


Claim :  నితిన్ గడ్కరీ లేచి మోదీకి మద్దతు తెలపలేదు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News