ఫ్యాక్ట్ చెక్: ఓ ఇంటిని భారీగా వరద నీరు ముంచేసిన విజువల్స్ కేరళకు సంబంధించినవి కావు.

భయభ్రాంతులకు గురి చేసే ఈ విజువల్స్ కేరళలోని వాయనాడ్ కు సంబంధించినవి

Update: 2024-08-06 03:31 GMT

కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 222గా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. బాధితుల మృతదేహాల కోసం అన్వేషణ గత ఏడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. మృతుల్లో 37 మంది చిన్నారులు, 88 మంది మహిళలు ఉన్నారు. 172 మృతదేహాలను బంధువులు గుర్తించారు. జూలై 30న చూరల్‌మల, ముండక్కై.. అట్టమల ప్రాంతాలలో ప్రకృతి ప్రకోపం చూపించింది. బురదతో నిండిపోయిన ప్రాంతం నుండి రెస్క్యూ సిబ్బంది 180 శరీరాలను వెలికితీశారు.
ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహాలు, శరీర భాగాలకు శవపరీక్ష చేసి.. గుర్తింపు కోసం DNA నమూనాలను కూడా సేకరించారు. 206 మంది వ్యక్తులు ఇంకా కనిపించలేదని అంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన మొదలైంది.

దాదాపు 1,000 మందిని రక్షించినట్లు ఆర్మీ నివేదించింది. సైనిక సిబ్బంది సెర్చ్, రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి పలు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి.

కేరళలోని వాయనాడ్‌లో పరిస్థితిని చూపించడానికి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక వీడియోలో, నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతూ ఉండగా.. ఒక ఇంటి గేటు నీటిలో మునిగిపోతూ ఉంటుంది.. ఇది CCTV ఫుటేజ్ లాగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేసి.. కేరళలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు.





ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ వీడియో కేరళలోని వాయనాడ్‌కి చెందినది కాదు.. ఈ వీడియో చైనాలోని మీజౌలో వరదలకు సంబంధించినది.

వీడియోను గమనించినప్పుడు, మేము టైమ్ లాగ్‌తో పాటు.. 2024-06-16 అనే తేదీని కూడా కనుగొన్నాము. వాయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన తేదీకి.. ఈ తేదీ భిన్నంగా కనిపిస్తోందని మేము గుర్తించాం.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. ఒక X వినియోగదారు జూలై 4, 2024న అదే వైరల్ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోకు కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. "ఇటీవల చైనాలో వరదలకు సంబంధించిన ఈ వీడియో ప్రకృతికి ఉన్న అపారమైన శక్తిని చూపుతుంది" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. దీన్ని బట్టి ఇటీవలి వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉందని ఇది రుజువు చేస్తుంది.




మేము Redditలో అప్‌లోడ్ చేసిన అదే వీడియోను కూడా కనుగొన్నాము. చైనాలోని మీజోలో వరదల సమయంలో 6 గంటల సమయంలో నీరు ఎలా పెరిగిందో చూడొచ్చని అందులో తెలిపారు.

మేము "చైనాలో వరదలు" అనే కీలక పదాన్ని ఉపయోగించి సెర్చ్ చేయగా.. యూట్యూబ్ ఛానెల్ అయిన డిజాస్టర్ అప్‌డేట్ జూన్ 16, 2024న.. మీజో, గ్వాంగ్‌డాంగ్, చైనా కు సంబంధించిన టైమ్-లాప్స్ వీడియోను అప్‌లోడ్ చేసింది.

Full View



వీడియో వివరణలో.. మీజో, చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన నగరం. ఈ ప్రాంతంలో వేసవి నెలలలో గణనీయమైన వర్షపాతం నమోదవుతూ ఉంటుందని తెలిపారు. జూన్ 16, 2024న, భారీ వర్షాల కారణంగా మీజౌ తీవ్రమైన వరదలను ఎదుర్కొంది. వరదనీరు వేగంగా పెరగడం, వీధులు, ఇళ్లు, వ్యాపార సంస్థలను ముంచెత్తడాన్ని టైమ్ లాప్స్ వీడియో క్యాప్చర్ చేసింది. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థలు కూడా నాశనమయ్యాయని తెలిపారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ వీడియో కేరళలోని వాయనాడ్ కు సంబంధించింది కాదు. ఇది చైనాలోని మీజౌలో వరదలకు సంబంధించిన CCTV ఫుటేజీ.


Claim :  భయభ్రాంతులకు గురి చేసే ఈ విజువల్స్ కేరళలోని వాయనాడ్ కు సంబంధించినవి
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News