ఫ్యాక్ట్ చెక్: మంటల్లో ఉన్న భవనం బంగ్లాదేశ్‌లోని ఆలయం కాదు.. అది ఓ రెస్టారెంట్.
కాలిపోయిన ఆలయం అంటూ చెబుతున్న వైరల్ ఫోటోలు
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా దోపిడీలు, అల్లర్లకు, హత్యలకు దారితీసింది. మైనారిటీ హిందూ సమాజంపై ప్రత్యేకించి వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నట్లు అనేక నివేదికలు వచ్చాయి. ఈ గందరగోళం మధ్య, బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా జిల్లాలో హిందూ దేవాలయం తగలబడిపోతున్నట్లు చూపుతున్న వైరల్ ఛాయాచిత్రాలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
ఖుల్నా డివిజన్‌లో మెహర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ ఆలయాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. నివేదికల ప్రకారం.. మెహర్‌పూర్‌లో అద్దెకు తీసుకున్న ఇస్కాన్ సెంటర్ దగ్ధమైంది. అందులో ఉన్న ముగ్గురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్ ట్వీట్ లో.. “బంగ్లాదేశ్ అప్‌డేట్.. నాకు అందిన సమాచారం ప్రకారం, మెహెర్‌పూర్ (ఖుల్నా డివిజన్)లోని మా ఇస్కాన్ సెంటర్‌లో ఒకదాన్ని దహనం చేశారు. సెంటర్‌లో నివసించే ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు." అని తెలిపారు.
ఖుల్నా డివిజన్‌లో మెహర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ ఆలయాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. నివేదికల ప్రకారం.. మెహర్‌పూర్‌లో అద్దెకు తీసుకున్న ఇస్కాన్ సెంటర్ దగ్ధమైంది. అందులో ఉన్న ముగ్గురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్ ట్వీట్ లో.. “బంగ్లాదేశ్ అప్‌డేట్.. నాకు అందిన సమాచారం ప్రకారం, మెహెర్‌పూర్ (ఖుల్నా డివిజన్)లోని మా ఇస్కాన్ సెంటర్‌లో ఒకదాన్ని దహనం చేశారు. సెంటర్‌లో నివసించే ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు." అని తెలిపారు.
"మేము రాత్రంతా నిద్రపోలేకపోయాము": బంగ్లాదేశ్ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్ర ప్రభు దేశంలో హిందూ దేవాలయాలపై దాడి జరగడంపై రిపబ్లిక్‌తో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఓ భవనంలో మంటలు అంటుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"బంగ్లాదేశ్ అనాగరిక ఇస్లాంవాదులు మరో హిందూ దేవాలయానికి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలను రక్షించే LKFC జుబైర్ సోదరులు ఎక్కడ ఉన్నారు? దీన్ని విస్తృతంగా షేర్ చేయండి. ప్రపంచానికి ఇస్లామిక్ అనాగరికతను చూపించండి" అనే శీర్షికతో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.
https://youtu.be/8FQFIeA0QAo?si=6uDf-1b_FiCmDOWM
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా జిల్లాలో మంటల్లో ఉన్న భవనాన్ని చూపించే వీడియో వాస్తవానికి అదొక రెస్టారెంట్, ఆలయం కాదు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Md Tariqul Vlogs అనే యూట్యూబర్ తన YouTube ఛానల్ లో “রাজ প্রাসাদ রেস্টুরেন্ট কলারোয়া, সাতক্ষীরা।“ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశాడు. అనువదించగా "రాజ్ ప్యాలెస్ రెస్టారెంట్ కలరోవా, సత్కిరా" అని తేలింది.
వైరల్ వీడియోలోని భవన నిర్మాణ శైలి.. ఈ రెస్టారెంట్ నిర్మాణ శైలి ఒకటే అని మేము కనుగొన్నాము.
మేము సత్ఖిరాలోని రాజ్ ప్యాలెస్ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేయగా.. 12.7K సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ఫరూక్ హొస్సేన్ (రాజ్) అనే యూట్యూబర్ రెస్టారెంట్ ప్రమోషనల్ వీడియోను అప్‌లోడ్ చేశారని మేము గమనించాం.
ఈ రెస్టారెంట్ పేరు రాజ్ ప్రసాద్ అని బ్లాగర్ చెప్పాడు. అతను #rajprashad #restaurant అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పేర్కొన్నట్లు మేము కనుగొన్నాము.
వైరల్ వీడియోలోని భవనంతో పోలిక, భవనం డిజైన్ రెస్టారెంట్‌తో దగ్గరగా సరిపోలుతుందని తెలుస్తోంది.
“ఇది దేవాలయం కాదు, సత్ఖిరాలోని రెస్టారెంట్” అని పోస్ట్ చేసిన X వినియోగదారుని మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం. వైరల్ వీడియోలో మంటల్లో ఉన్న భవనం ఆలయం కాదు, సత్ఖిరాలోని రెస్టారెంట్.
Claim : బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా జిల్లాలో హిందూ దేవాలయానికి నిప్పు పెట్టారు
Claimed By : social media users
Fact Check : False