నిజ నిర్ధరణ: హైదరాబాద్ ఆకాశంలో కనపడింది భారీ బెలూన్, యూఎఫ్ ఓ లేదా స్పేస్‌షిప్ కాదు

ఆకాశంలో భారీ బెలూన్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది, అది యూ ఎఫ్ ఓ (గుర్తించబడని ఎగిరే వస్తువు) లేదా గ్రహాంతరవాసులను తీసుకువెళుతున్న అంతరిక్ష నౌక కావచ్చు.

Update: 2022-12-12 08:39 GMT

ఆకాశంలో భారీ బెలూన్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది, అది యూ ఎఫ్ ఓ (గుర్తించబడని ఎగిరే వస్తువు) లేదా గ్రహాంతరవాసులను తీసుకువెళుతున్న అంతరిక్ష నౌక కావచ్చు.

ఈ వీడియో డిసెంబర్ 7, 2022న ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యింది.

ఆకాశంలో వింత ఆకారం.. హైదరాబాద్‌కు ఏలియన్స్.? | న్యూస్18 తెలుగు

Full View


Full View

వాట్సాప్‌లో, ఈ వీడియో క్లెయిం తో షేర్ అయ్యింది: "ఆకాశంలో వింత తెలుపు రంగు వస్తువు. ఇది ప్లానెట్ లేదా స్టార్..లేదా భూమికి దగ్గరగా వచ్చిన మార్స్ గ్రహమా అని ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు కొందరు ఇది గ్రహాంతర నౌక లేదా యూఎఫ్‌వో అని ఆశ్చర్యపోయారు. ఇది ఖచ్చితంగా ఏమిటి? "

హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ సమీపంలోని మొగలిగిద్ద గ్రామస్థులు వ్యవసాయ పొలాల్లో వృత్తాకారంలో ఉన్న భారీ వస్తువు పడినట్టు ఉన్న వీడియో కూడా వైరల్‌గా మారింది. దానికి కొన్ని లైట్లు అమర్చి ఉండడంతో అది స్పేస్ షిప్ అయి ఉండొచ్చని గ్రామస్తుల సంభాషణ కూడా వీడియోలో ఉండడం గమనార్హం.

నిజ నిర్ధారణ:

హైదరాబాద్ స్కైలైన్‌లో దొరికిన భారీ బెలూన్ యూ ఎఫ్ ఓ అనే వాదన అవాస్తవం. ఇది నేషనల్ బెలూన్ ఫెసిలిటీ ద్వారా పరిశోధన కోసం పంపిన హీలియం బెలూన్.

తెలంగాణ టుడేలో ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ వాతావరణ అధ్యయనాల కోసం బెలూన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది దాదాపు 1,000 కిలోల బరువున్న పరికరాన్ని తీసుకెల్లిందని ఆయన తెలిపారు.

వివిధ ఆల్టిత్యూడ్ ల వద్ద పీడనం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం మార్పులను లెక్కించడంలో వాతావరణ పరిశోధన బెలూన్‌లు సహాయపడతాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ బుడగలు పంపిన సమాచారంతో వాతావరణ సౌండింగ్ గ్రాఫ్‌లు వేస్తారు, ఇవి వాతావరణాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి.

https://telanganatoday.com/hyderabad-strange-phenomenon-caught-in-sky-experts-clarify

ది న్యూస్ మినిట్‌లోని నివేదిక ప్రకారం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ అనుసంధానం ఉన్న నేషనల్ బెలూన్ ఫెసిలిటీ (ఎన్‌బిఎఫ్) ప్రయోగాత్మక పరిశోధనలో భాగంగా బెలూన్ విడుదల చేసినట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

ఎంబిఎఫ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జి. ప్రవీణ్ రెడ్డి కధనం ప్రకారం డిసెంబర్ 7, 2022 ఉదయం 5.30 గంటలకు హైడ్రోజన్ బెలూన్‌లో ఆకాశంలోకి ఒక పరికరాన్ని పంపారు. అధ్యయనానికి అవసరమైన డేటాను సేకరించిన తర్వాత, బెలూన్‌ను క్రిందికి తీసుకువచ్చారు. రిమోట్ కంట్రోల్ ద్వారా పారాచూట్ సహాయంతో ఎగిరిన బలూన్ వికారాబాద్‌లో ఖాలీ స్థలంలో దిగింది. స్పెయిన్‌లోని శాస్త్రవేత్తల సహకారంతో పరిశోధన జరుగుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

అదే తరహాలో ఇతర వార్తా వెబ్‌సైట్‌లలో కూడా వార్తలు వచ్చాయి.

https://kalingatv.com/offbeat/strange-phenomenon-caught-in-hyderabad-sky-watch/

https://telugu.oneindia.com/news/telangana/alien-ships-propaganda-in-telangana-strange-objects-in-vikarabad-fields-hyderabad-sky-are-the-rea/articlecontent-pf406781-332203.html

10 డిసెంబర్ 2022 - 24 డిసెంబర్ 2022 రాత్రి 11 నుండి ఉదయం 8 గంటల మధ్య కూడా మరో బెలూన్‌ల ప్రయోగం గురించి టీFఋ హెచ్చరిక జారీ చేసింది.


కనుక, హైదరాబాద్ స్కైలైన్‌లో కనిపించే భారీ తెల్లటి బెలూన్ యూఎఫో లేదా గ్రహాంతరవాసులను మోసే అంతరిక్ష నౌక కాదు. వాదన అవాస్తవం.

Claim :  object in the skies of Hyderabad is UFO
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News