నిజ నిర్ధారణ: సూపర్‌మార్కెట్‌లో గణేశుడి విగ్రహాలని పగలగొట్టిన ఘటన కేరళలో జరగలేదు, బహ్రెయిన్ లో జరిగింది
బుర్ఖా ధరించిన ఓ మహిళ, సూపర్ మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న హిందూ విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియో తెలుగులో వైరల్ అవుతోంది. “కేరళలోని ఈ వీడియోని చూసి మీకు వీలయినంత వరకు ఫార్వార్డ్ చేయండి....ఈ రోజు మీరు మౌనంగా ఉంటే మనకే నష్టం...ఎందుకంటే 6 నెలల తర్వాత దాన్ని కొనసాగించడం వల్ల ఉపయోగం ఉండదు...”
బుర్ఖా ధరించిన ఓ మహిళ, సూపర్ మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న హిందూ విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియో తెలుగులో వైరల్ అవుతోంది. "కేరళలోని ఈ వీడియోని చూసి మీకు వీలయినంత వరకు ఫార్వార్డ్ చేయండి....ఈ రోజు మీరు మౌనంగా ఉంటే మనకే నష్టం...ఎందుకంటే 6 నెలల తర్వాత దాన్ని కొనసాగించడం వల్ల ఉపయోగం ఉండదు..."
జూలై 2022 ఇదే క్లెయిమ్ హిందీ భాషలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లెయిం ను అనేక సంస్థలు అబద్దం అని నిర్ధారించాయి, కానీ ఇప్పుడు అది తెలుగు భాషలో షేర్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
ఆ వీడియోలో కనిపిస్తున్న ఘటన కేరళలో జరిగిందనేది అవాస్తవం. వైరల్ వీడియో 2020 సంవత్సరంలో, బహ్రెయిన్‌లో జరిగిన సంఘటనను చూపుతుంది.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, 2020 సంవత్సరంలో ప్రచురించబడిన వార్తల నివేదికలను లభించాయి.
ఈ నివేదికల ప్రకారం, గణేష్ చతుర్థికి ముందు స్థానిక సూపర్‌మార్కెట్‌లో గణేశుడి విగ్రహాలను విక్రయించడానికి ప్రదర్శించారు. ఇది ఇస్లామిక్ దేశమని, అలాంటి విగ్రహాలను దేశంలో విక్రయించరాదని 54 ఏళ్ల మహిళ దుకాణదారుడిపై అరవడం ప్రారంభించింది. ఆమె విగ్రహాలను ఒక్కొక్కటిగా తీసుకొని నేలపై పడేసింది.
మహిళపై చర్యలు ప్రారంభించినట్లు బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక ట్వీట్‌లో, దుకాణానికి నష్టం కలిగించినందుకు, ఒక నిర్దిష్ట వర్గాన్ని, దాని సంప్రదాయాలను అవమానించినందుకు 54 ఏళ్ల మహిళపై రాజధాని పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు ఆ మహిళపై అనేక నేరారోపణలు, మతపరమైన చిహ్నాన్ని అవమానించినట్లు అభియోగాలు మోపబడిందని ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 2022లో చేసిన వాస్తవ తనిఖీ నివేదికలు ఇక్కడ ఉన్నాయి.
అందుకే, ఆ వీడియోలో కనిపిస్తున్న ఘటన కేరళలో జరిగిందన్న వాదన అబద్దం. ఇది 2020కి చెందిన పాత వీడియో, బహ్రెయిన్ దేశానికి చెందినది.