ఫ్యాక్ట్ చెక్: జ్యోతి యర్రాజీ బంగారు పతకం గెలిచింది ఆసియా గేమ్స్ లో కాదు.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్
భారత్ కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.. జ్యోతి యర్రాజీ ఓ రేసులో విజయం సాధించిన
By - Sachin SabarishUpdate: 2023-10-02 17:50 GMT
భారత్ కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.. జ్యోతి యర్రాజీ ఓ రేసులో విజయం సాధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఆమె చైనాలో ఆసియా గేమ్స్ 100 మీటర్ల ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోను గాయని ఆశా భోంస్లేతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అధికారిక X ఖాతా ద్వారా పంచుకున్నారు. "ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యారాజీకి హృదయపూర్వక అభినందనలు." అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఆమెను అభినందించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మనం వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. వీడియో బ్యానర్ మీద 'Asian Athletics Championships 2023' అని ఉంది. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కు సంబంధించి 24వ ఎడిషన్.
మేము ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌స్, ఆసియా క్రీడల లోగోలను పోల్చి చూశాం. వైరల్ వీడియో 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కు సంబంధించిన ఫుటేజ్ అని ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది జ్యోతి. ఆసియా క్రీడల్లో జ్యోతి బంగారు పతకాన్ని గెలుచుకోలేదు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో జూలై 12 నుండి 16, 2023 వరకు సాగింది. ఐదు రోజుల పాటూ ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు షెడ్యూల్ చేశారు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా జావెలిన్ త్రో, హర్డిల్ రేసులు, లాంగ్ జంప్, షాట్‌పుట్, రిలే రేస్ లాంటి అథ్లెటిక్స్‌కు సంబంధించిన ఈవెంట్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌తో పాటు ఈత, షూటింగ్, క్రికెట్.. లాంటి గేమ్స్ కూడా ఉన్నాయి.
యర్రాజీ 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఆసియా గేమ్స్ లో జ్యోతి యర్రాజీకి రజతం లభించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో జ్యోతి యర్రాజీ రజతం కైవసం చేసుకుంది. ఫాల్స్ స్టార్ట్ వివాదం తరువాత జ్యోతి యర్రాజీని విజేతగా ప్రకటించారు. చైనీస్ రన్నర్ వు యాన్నీ లేన్ ఫోర్‌లో తప్పుగా ప్రారంభించింది. ఆమెను జ్యోతి కూడా అనుసరించింది. ఇక్కడే వివాదం సాగింది. అధికారులు ఫుటేజీని మళ్లీ తనిఖీ చేసి వాస్తవానికి యన్నీ దోషి అని నిర్ణయించారు. చైనాకు చెందిన లిన్ యువే (12.74) మొదటి స్థానంలో నిలిచింది. యన్నీ (12.91 సెకన్లు) టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచింది. రిప్లైల తర్వాత ఆమె స్థానంలో జ్యోతి యర్రాజి (13.04) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫాల్స్ స్టార్ట్ కారణంగా యన్నీకి షాక్ ఇచ్చారు నిర్వాహకులు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో యర్రాజీ విజయం సాధించిన వీడియోలను.. ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణం గెలిచిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో జ్యోతి యర్రాజీ రజతం సొంతం చేసుకుంది.
Claim : Indian athlete Jyothi Yarraj won gold medal at Asian Athletics Championship
Claimed By : Social Media Users
Fact Check : False