ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పతకం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' అందజేసారు, అంతేకానీ బంగారు హారాన్ని బహుమతిగా ఇవ్వలేదు
అబుదాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని మోదీ ని బంగారు హారంతో సత్కరిస్తున్న వీడియో “మోదీజీకి అరబ్ రాజు 1.6 కిలోల బరువున్న బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా ప్రధాని మోదీ లాంగ్ లివ్” అన్న కధనం తోటి వైరల్ అవుతోంది.;
అబుదాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని మోదీ ని బంగారు హారంతో సత్కరిస్తున్న వీడియో "మోదీజీకి అరబ్ రాజు 1.6 కిలోల బరువున్న బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా ప్రధాని మోదీ లాంగ్ లివ్" అన్న కధనం తోటి వైరల్ అవుతోంది.
ఈ క్లెయిం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా షేర్ చేయబడింది.
నిజ నిర్ధారణ:
భారత ప్రధాని మోదీకి అరబ్ రాజు బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడన్న వాదన అవాస్తవం. 2019లో ఊఆఏ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' తో ప్రధాని మోడీ ని సత్కరించారు. అప్పటి వీడియో ను తప్పుడు క్లెయిం తో ప్రచారం చేస్తున్నారు.
'అరబ్ దేశాల్లో మోడీ' అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, ప్రధానమంత్రిని యువరాజు గౌరవిస్తూ చిత్రాన్ని పంచుకున్న అనేక కథనాలను లభించాయి.
ఎకనామిక్ టైమ్స్‌లో 2019 లో ప్రచురితమైన కథనం ప్రకారం, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని నరేంద్ర మోడీకి యుఏఈ యొక్క అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్'ని ప్రదానం చేశారు. యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద పెట్టబడిన ఈ అవార్డు షేక్ జాయెద్ జయంతి సందర్భంగా మోదీకి ప్రదానం చేసారు.
ఆగస్ట్ 2019లో ఇండియాటుడేలో ప్రచురించబడిన కథనం ప్రకారం, ఈ అవార్డును ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్ ఈఈ మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ నాయకులకు అందించారు.
"యుఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద ఈ అవార్డు షేక్ జాయెద్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ప్రధాని మోడీకి ఇవ్వబడినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదే వార్త గల్ఫ్ న్యూస్ ఆన్‌లైన్ ట్విటర్ ఖాతాలో ప్రచురించబడింది
తనకు 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' లభించినట్లు ధృవీకరిస్తూ చిత్రాలను ఆగస్ట్ 2019 లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాబట్టి, ప్రధాని మోదీకి బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చారనే వాదన అబద్ధం. వైరల్ వీడియో 2019లో భారత ప్రధాని మోదీకి అబుదాబి యువరాజు యుఏఈ అత్యున్నత గౌరవం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' ప్రదానం చేస్తున్న ఘట్టం చూపిస్తోంది.