ఫ్యాక్ట్ చెక్: ట్యూబ్ వెల్ పేలడం వల్ల జైసల్మేర్‌ సముద్రంలా మారలేదు

డిసెంబర్ 28, 2024న జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ కెనాల్ సమీపంలో ట్యూబ్‌వెల్ తవ్వే సమయంలో అకస్మాత్తుగా భూగర్భం లో నుంచి జలాలు

Update: 2025-01-01 10:29 GMT

డిసెంబర్ 28, 2024న జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ కెనాల్ సమీపంలో ట్యూబ్‌వెల్ తవ్వే సమయంలో అకస్మాత్తుగా భూగర్భం లో నుంచి జలాలు, గ్యాస్ విడుదల అయ్యాయి. 10 అడుగుల ఎత్తులో నీరు ఎగసిపడ్డాయి, ఫలితంగా డ్రిల్లింగ్ మెషిన్, ట్రక్కు భూమిలో చిక్కుకుపోయాయి. భూగర్భ జలాశయం విచ్చిన్నమవడం వల్ల ఇలా నీరు ఎగసిపడ్డాయని తెలుస్తోంది. 24 గంటలు గడిచినా నీటి ప్రవాహం ఆగకపోవడంతో ఆ ప్రదేశం చెరువు కట్టలా తయారైంది.

ఇంతలో, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు సరస్వతి నది ఎగసిపడుతోంది అంటూ పోస్ట్లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ ఘటన కారణంగా జైస్లామర్ సముద్రంగా మారిందని పేర్కొంటూ మరికొంతమంది వినియోగదారులు అనేక ఇళ్లు, వీధులు పూర్తిగా నీటిలో మునిగిపోయిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంది. కొన్ని వీడియోలు “రాజస్థాన్ లోని జైసలమేర్ సముద్రం అయిపోయింది”, “రాజస్థాన్ లోని జైసలమేర్ ను వరద ముంచేసింది” వంటి క్యాప్షన్‌లతో షేర్ అయ్యాయి.

Full View

Full View

Full View

Full View



క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వాదన అబద్దం. ఆ వీడియో జైసల్మేర్‌కి సంబంధించినది కాదు.

జైసల్మేర్ గురించి మరింత సమాచారానికి సంబంధించిన వీడియోల కోసం వెతికినప్పుడు, డిసెంబర్ 30, 2024న ట్యూబ్‌వెల్ సంఘటన జరిగిన ప్రదేశం, పరిసరాలను చూపుతున్న టైమ్స్ నౌ నవభారత్ నివేదిక లభించింది, ఇది వైరల్ వీడియోలోని విజువల్స్‌కు పూర్తిగా భిన్నంగా ఉంది.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చిందని, ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని వీడియో వివరణ పేర్కొంది. డిసెంబర్ 28న ఉదయం 10 గంటల సమయంలో జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ ప్రాంతంలోని పొలంలో బోరుబావి తవ్వనారంభించారు. దాదాపు 850 అడుగుల మేర తవ్విన తర్వాత ఒక్కసారిగా బలంగా నీరు రావడం మొదలైంది. భూమి నుండి వచ్చే నీటి ప్రవాహం చాలా బలంగా, అనేక అడుగుల ఎత్తులో ఉబకడం ప్రారంభించింది. నీటి ఒత్తిడి కారణంగా ఘటనా స్థలంలో దాదాపు 20 అడుగుల వెడల్పు చెరువు లా మారింది.

Full View

జీ న్యూస్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ సంఘటన వల్ల నేల కూరుకుపోయి, చాలా బలంగా నీరు, వాయువును విడుదల చేసింది. ఇది స్థానికులలో భయాందోళనలను కలిగించింది. జైసల్మేర్ జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ నథావత్ తరువాతి రోజు రాత్రి 10 గంటలకు లీకేజీ ఆగిపోయిందని, ప్రజలు తమ భద్రత కోసం ఈ ప్రాంతాన్ని నివారించాలని కోరారు.

patrika.com ప్రకారం, 27 భ్డ్ కాలువ ప్రాంతంలోని చాక్ 3 జొరవాలా మైనర్ పొలంలో ట్యౌబ్ వెల్ ను తవ్వే సమయంలో ఎగసిపడిన నీటి ప్రవాహం సుమారు 41 గంటల తర్వాత ఆగిపోయింది. వరుసగా రెండు రోజులు భూమి నుంచి నీరు ఎగసిపడింది. తరువాత, ఆ ప్రవాహం ఆగిపోయింది. అయితే, మళ్లీ లీకేజీ మొదలయ్యే అవకాశం ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. అదే స్థలం నుండి మళ్లీ లీకేజీ ప్రారంభమైతే, విష వాయువు మొదలైనవి లీక్ కావచ్చు. భూమి కుంగిపోయి పేలుడు సంభవించే అవకాశం కూడా ఉంది.

సబ్-తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మోహన్‌గర్ లలిత్ చరణ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జైసల్మేర్ ఈ ప్రాంతంలో ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్‌లోని సెక్షన్ 163 విధించారని, ఇది ప్రస్తుతానికి అమలులో ఉంటుందని చెప్పారు. ట్యూబ్‌వెల్ మీటర్ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దనీ, పశువులను అనుమతించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిపుణుల అభిప్రాయం వచ్చే వరకు ఈ గొట్టపు బావిలో ఇరుక్కున్న పరికరాలను బయటకు తీయడానికి ప్రయత్నించకుండా కూడా నిషేధించారు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేయగా, అక్టోబర్ 2024లో ప్రచురించిన Instagram పోస్ట్‌ మాకు లభించింది.

ఫ్లోరిడా & ఫ్లోరిడామాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వైరల్ వీడియోను ‘హరికేన్ మిల్టన్ - ఫోర్ట్ మైయర్స్ బీచ్, ఎస్టీరో ద్వీపంలో సగం, అక్టోబర్ 9 సాయంత్రం 5:30 గంటలకు క్యాప్షన్‌తో షేర్ చేసారు. (క్రెడిట్ @stevenmichaelcalabrese )’.

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @stevenmichaelcalabrese కోసం శోధించగా, 'ఫోర్ట్ మైయర్స్ బీచ్, అక్టోబర్ 9న సాయంత్రం 5:30 గంటలకు ఎస్టీరో ద్వీపంలో సగం దూరంలో ఉంది. మిల్టన్ హెలెన్వల్ల రెట్టింపు వరదలు వచ్చాయి.' అనే క్యాప్షన్ తో షేర్ చేసింది.

వార్తానివేదికల ప్రకారం, హరికేన్ మిల్టన్ అక్టోబర్ 2024 లో ఫ్లోరిడాలో కుప్పకూలింది, ఇది వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. కాబట్టి, డిసెంబర్‌ 2024 లో ట్యూబ్ వెల్ పగలడం వల్ల జైసల్మేర్‌లో వరదలు వచ్చి సంధ్రం లా మారడం వైరల్ వీడియో చూపించడంలేదు. వాదన అబద్దం. 

Claim :  ట్యూబ్‌వెల్ పేలడం వల్ల జైసల్మేర్‌ సముద్రం లా మారడం వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News