ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలో జరిగిన కార్యక్రమాన్ని మహారాష్ట్రకు చెందినదిగా ప్రచారం చేస్తున్నారు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లెజిస్లేచర్ పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 5, 2024న;
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లెజిస్లేచర్ పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 5, 2024న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో వేలాది మంది ప్రజల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు అజిత్ పవార్‌తో పాటుగా, షిండే శివసేన వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపితో కూడిన మహాయుతి కూటమి కాంగ్రెస్, శివసేన (యుబిటి), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి తో కూడిన ఎంవిఎ కూటమికి వ్యతిరేకంగా పోటీ పడింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ మైదానంలో వేలాది మంది నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగిందని చెబుతున్నారు. క్యాప్షన్‌లో “ఈ దృశ్యం బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుండి వచ్చింది కాదు!! ఇది మహారాష్ట్రలో కనిపించింది. హిందువులారా మేల్కోవాల్సిన సమయం వచ్చింది" అని క్యాప్షన్స్ లో చెప్పారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ వీడియో హైదరాబాద్ కు చెందినది మహారాష్ట్రలో జరిగిన ఘటన కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ‘Visuals of Maghrib salah Shankarpally Tblighi Jamat ijtema’ (శంకర్‌పల్లి లో జమాత్ కార్యక్రమం) అనే క్యాప్షన్ తో ఉన్న వీడియోలను మేము YouTubeలో కనుగొన్నాము.
‘Telangana ke #shankarpally me #Tablighi #jamaat ke Ejtema ka Aghaaz | #youtubechannel’ అనే టైటిల్ క్యాప్షన్ తో మరికొందరు వీడియోను అప్లోడ్ చేశారు.
యూట్యూబ్ ఛానెల్ సాహెర్ న్యూస్‌లో ప్రచురించిన వీడియో ప్రకారం, జనవరి 3 నుండి జనవరి 5 వరకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర పల్లిలో తబ్లిఘి జమాత్ ఇజ్తేమాను నిర్వహించారు.
Siasat.com ప్రకారం, ఇజ్తేమాను ముస్లింల సహకారంతో ఇస్లామిక్ సమూహాల ద్వారా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు ముస్లింల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మతపరమైన సందేశాలను ఇస్లామిక్ పెద్దలు ఈ కార్యక్రమాల్లో ఇస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇజ్తేమాలో చురుకుగా పాల్గొంటారు, అనేక దేశాలలో ఈ ఈవెంట్‌ను ఇదే విధంగా నిర్వహిస్తూ ఉంటారు. TSGENCOకు చెందిన ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు లభించాయి. నిర్వాహకులు, ప్రభుత్వంతో కలిసి గత 45 రోజులుగా అవిశ్రాంతంగా పని చేస్తూ, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి అవసరమైన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించారు.
వైరల్ అవుతున్న వీడియో మహారాష్ట్రకు చెందినది కాదు, హైదరాబాద్ కు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : వైరల్ వీడియో మహారాష్ట్రలో జరిగిన సభ ను చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Misleading