ఫ్యాక్ట్ చెక్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తో కరచాలనం చేశారు

మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జీ7 సమావేశాల కోసం నరేంద్ర మోదీ ఇటలీకి వెళ్లివచ్చారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలోని ఫాసనోకు ఆహ్వానించిన 12 దేశాలలో భారతదేశం కూడా ఒకటి. G7తో గ్లోబల్ సౌత్‌ను భాగస్వామ్యం చేయాలని ఇటాలియన్ PM మెలోని భావించారు

Update: 2024-06-20 11:44 GMT

G7

మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జీ7 సమావేశాల కోసం నరేంద్ర మోదీ ఇటలీకి వెళ్లివచ్చారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలోని ఫాసనోకు ఆహ్వానించిన 12 దేశాలలో భారతదేశం కూడా ఒకటి. G7తో గ్లోబల్ సౌత్‌ను భాగస్వామ్యం చేయాలని ఇటాలియన్ PM మెలోని భావించారు. G7లో తొలిసారిగా ప్రసంగించేందుకు పోప్ ఫ్రాన్సిస్‌ను కూడా మెలోని ఆహ్వానించారు.

తన పర్యటనలో కొంతమంది ప్రపంచ నేతలతో సమావేశమైన మోదీ ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, యూకేలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్, కెనడా ప్రధాన మంత్రి ట్రూడోతో ఆయన అధికారికంగా సమావేశమయ్యారు.
ఇంతలో, ప్రధాని మోదీ మరొక వ్యక్తితో కలిసి నడుస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అమెరికా భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకుందని.. ఆ దేశానికి మన సత్తా చూపించాలని జో బిడెన్‌తో కరచాలనం చేయడానికి మోదీ నిరాకరించారనే వాదనతో పోస్టులను షేర్ చేస్తున్నారు.
“जो बाईडेन से हाथ न मिलाकर मोदी जी ने अमेरिका को उसकी औकात दिखा दी हमारे चुनावों में दखलअंदाजी का नतीज़ा औकात दिखा देंगे दुनिया के सामने !! అంటూ హిందీలో పోస్టును వైరల్ చేస్తున్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కాదు.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేయగా.. వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తిని చూపుతూ YouTubeలో అప్లోడ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులను వేదిక వద్దకు తీసుకుని వెళ్లడం లాంటివి ఆయన చేస్తూ ఉండడం చూడవచ్చు. 'President Erdogan in Italy for the G7 Leaders Summit' అనే వీడియోలో ఆయన చేస్తున్న పనులను చూసి.. ఈ కార్యక్రమ నిర్వాహకుల బృందంలో ఆయన కూడా ఒకరని భావిస్తున్నాం.
Full View

‘Biden awkwardly salutes Italian Prime Minister Giorgis Meloni as he arrives at G7 Summit’ అనే టైటిల్ తో పబ్లిష్ చేసిన వీడియోలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కూడా అదే వ్యక్తి వేదిక వైపుకు తీసుకుని వెళ్లడాన్ని గుర్తించాం.
Full View
G7 సమ్మిట్ అధికారిక Flickr ఖాతాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఆ వ్యక్తి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకుంది.
వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్, Flickrలో ప్రచురించిన చిత్రాల మధ్య పోలిక ఇక్కడ ఉంది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మోదీ కరచాలనం చేస్తున్న చిత్రాలను.. భారత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు మేము కనుగొన్నాము. ‘It’s always a pleasure to meet @POTUS @JoeBiden. India and USA will keep working together to further global good’ అనే క్యాప్షన్ తో పోస్టు పెట్టారు నరేంద్ర మోదీ. అమెరికా-భారత్ కలిసి పని చేస్తాయని మోదీ తెలిపారు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కాదు. భారత ప్రధాని మోదీని వేదిక వద్దకు వెళ్లమని సూచించిన వ్యక్తి. జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలిసినప్పుడు భారత ప్రధాని మోదీ కరచాలనం చేసేందుకు నిరాకరించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఇటలీలో నిర్వహించిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కరచాలనం చేయలేదు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News