ఫ్యాక్ట్ చెక్: కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తనకు పక్షవాతం వచ్చిందని జస్టిన్ బీబర్ చెప్పలేదు

ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ ఇటీవల ప‌క్ష‌వాతానికి గురైయ్యాడు. ఈ విష‌యాన్ని అత‌డు స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని అభిమానులకు సూచించాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని కొద్దిరోజుల ముందు తెలిపాడు.

Update: 2022-07-17 04:58 GMT

క్లెయిమ్: కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తనకు పక్షవాతం వచ్చిందని సింగర్ జస్టిన్ బీబర్ చెప్పాడా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ ఇటీవల ప‌క్ష‌వాతానికి గురైయ్యాడు. ఈ విష‌యాన్ని అత‌డు స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని అభిమానులకు సూచించాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని కొద్దిరోజుల ముందు తెలిపాడు.



Full View
అయితే కోవిడ్-19 వ్యాక్సిన్‌ల కారణంగా బీబర్ కు ఇలా అయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో, చాలా మంది వాంకోవర్ టైమ్స్ నుండి వచ్చిన వార్తా నివేదికను పంచుకున్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడం వలనే అతడికి ఇలా జరిగిందని.. అతని ముఖంలో శాశ్వత పక్షవాతం కలిగించిందని చెప్పారు.
"వ్యాక్సిన్ నా జీవితాన్ని నాశనం చేసింది" అని జ‌స్టిన్ బీబ‌ర్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.

ఫ్యాక్ట్ చెకింగ్

మా బృందం ఈ వార్త అబద్దమని తెలుసుకుంది. దీనిపై జస్టిన్ బీబర్ కూడా వివరణ ఇచ్చాడు.

ముఖంపై కుడివైపున ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ని, ఆ కార‌ణంగా క‌న్ను ఆడించ‌లేక‌పోతున్నాన‌ని, ఇక కుడి వైపున చిరున‌వ్వు కూడా క‌నిపించ‌ద‌ని, ఆ సైడ్ మొత్తం పెరాల‌సిస్ వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. జస్టిన్ బీబర్ జూన్ 10న ఒక వీడియోను పోస్టు చేసి తనకు ఉన్న పెరాలసిస్ గురించి వివరించాడు. కెనడియన్ సింగర్ తాను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. తన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫేషియల్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తుంది. ఇందుకు ఎంత సమయం పడుతుందో మాకు తెలియదు. నేను దేవుడిని నమ్ముతానని వెల్లడించాడు. ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, తిరిగి ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని జస్టిన్ బీబర్ తెలిపాడు.
క్లెయిమ్ చేస్తున్న వార్తల్లో.. చాలా మంది వ్యక్తులు వాంకోవర్ టైమ్స్ కథనాన్ని తమ వార్తకు మూలంగా పంచుకున్నారు. కథనం దిగువన, ఈ నివేదిక వ్యంగ్యంగా ఉందని చెప్పే అప్డేట్ కూడా ఉంది. వాంకోవర్ టైమ్స్ యొక్క "అబౌట్ అస్" విభాగంలో వ్యంగ్య కథనాలను వ్రాస్తామని తెలిపింది.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని.. కేవలం సెటైర్ అని తేలింది.


క్లెయిమ్: కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తనకు పక్షవాతం వచ్చిందని సింగర్ జస్టిన్ బీబర్ చెప్పాడా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Justin Bieber blame Covid-19 vaccine for facial paralysis
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News