ఫ్యాక్ట్ చెక్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పాల ధరలను పెంచలేదు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పాల ధరలను

Update: 2024-11-28 15:09 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్నాథ్ షిండేలలో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చ జరుగుతూ ఉంది. నవంబర్ 23, 2024న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయ పండితులు, ఓటర్ల మదిలో ఎవరు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్న వెంటాడుతూ ఉంది. మహారాష్ట్ర సీఎం షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో కూడిన మహాయుతి కూటమి త్వరలో కొత్త సీఎంను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు సమావేశమయ్యారు.


ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది సభ్యుల సభలో 230 సీట్లు గెలుచుకుని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ 132 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది, షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కేవలం 16 సీట్లు మాత్రమే గెలుచుకోగా..శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్పీ) కేవలం 10 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే (యూబీటీ) 20 సీట్లు గెలుచుకుంది.

మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయిన వెంటనే పాల ధరలు పెంచేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎన్నికల ముందుకు, ఇప్పటికీ చాలా తేడా వచ్చాయి పాల ధరలలో అంటూ చెప్పడం మనం వినవచ్చు.

'ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వం రికవరీ మొదలుపెట్టింది. ఈ ప్యాకెట్ ధర నిన్న 33 రూపాయలు ఉండగా ఇప్పుడు 34 రూపాయలు అయింది. మరొకటి 66 రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది కాస్తా 68 రూపాయలు అయింది. టోల్ పన్నులు కూడా పెంచారు' అంటూ చెప్పడం మనం వినవచ్చు. వీడియోలో పాల ప్యాకెట్లను కూడా చూపించారు.




వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

వైరల్ పోస్టుల్లోని వీడియోలో చూపించింది అమూల్ బ్రాండ్ కు సంబంధించిన పాల ప్యాకెట్. మేము అందుకు సంబంధించి గూగుల్ లో సెర్చ్ చేశాం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అమూల్ ధరల పెంపును ప్రకటించారా లేదా అని తెలుసుకోడానికి మా వెతుకులాట ప్రారంభించగా.. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ముందు లేదా ఆ తర్వాత పాల ధరలను పెంచినట్లుగా అలాంటి ప్రకటన ఏదీ కనిపించలేదు.

అమూల్ పాల ధరలు పెంచినట్లుగా జూన్ 3, 4 తేదీల్లో పలు తెలుగు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

జూన్ 3, 2024న వచ్చిన వార్తా కథనాల ప్రకారం.. 'గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు 2024 జూన్ 3 సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లుగా అమూల్ సంస్థ తెలిపింది. గేదె పాలు 500 మి.లీ ప్యాకెట్‌పై రూ.2, లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.3 పెంచింది. అమూల్ గోల్డ్ పాలపై లీటర్‌కు రూ.2, హాఫ్ లీటర్‌కు రూ.1 చొప్పున పెంచినట్లు' అందులో ఉన్నాయి.

వైరల్ వీడియోలోని పాలపై “04-06-24” అనే తేదీ ఉందని గమనించాం. కాబట్టి, ఈ పాల ప్యాకెట్లు చాలా పాతవని అర్థం అవుతోంది.


ఇక వైరల్ వీడియోను తీసింది ఎవరు, ఎక్కడ తీశారు అనే వివరాలు తెలుగు పోస్ట్ ధృవీకరించలేకపోయింది. అయితే పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వీడియోకు, ఇటీవలి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదంటూ నిజ నిర్ధారణ చేశాయి.

https://www.lighthousejournalism.com/viral/fact-check-milk-prices-have-not-increased-after-maharashtra-assembly-polls-
3317/


https://news.abplive.com/fact-check/amul-milk-prices-were-increased-in-june-not-after-maharashtra-polls-1733861

వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మేము ధృవీకరించాం.


Claim :  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పాల ధరలను ప్రభుత్వం పెంచేసింది
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News