క్లెయిం స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్: వలలో చిక్కుకున్న Polar Bear ని మత్స్యకారులు రక్షించిన వీడియో ఏఐ ద్వారా సృష్టించారు
AI సాంకేతికత ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. నిజమైన వీడియోలను సృష్టించేలాగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఏది నిజమో;
AI సాంకేతికత ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. నిజమైన వీడియోలను సృష్టించేలాగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియజేయడం చాలా కష్టంగా మారుతోంది. మెరుగైన అల్గారిథమ్‌లు, విస్తారమైన డేటా సెట్‌ల కారణంగా ఈ పురోగతి సాధ్యమైంది. Soro, Meta AI వంటి AI సాధనాలు వినియోగదారులందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి, కనీస ఎడిటింగ్ నైపుణ్యాలతో ఎవరైనా ప్రొఫెషనల్‌గా కనిపించే వీడియోలను సృష్టించవచ్చు.
ధృవపు ఎలుగుబంటి (Polar Bear) తన పిల్లతో పాటు ఆర్కిటిక్ ప్రాంతంలో చేపల వలలో చిక్కుకుపోయినట్లు చూపించే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడలో ప్రయాణిస్తున్న మత్స్యకారులు ఎలుగుబంటిని రక్షించడం కూడా మనం ఈ వీడియో లో చూడోచ్చు. మంచు ప్రాంతాలలో కూడా మనుషుల కారణంగా అమాయక జంతువులు ఎలా బలి అవుతున్నాయనే విషయం పైన వీడియో బలమైన సందేశాన్ని ఇస్తుంది.
పోల్స్ దగ్గర కరిగిపోతున్న మంచు వల్ల పోలార్ బేర్స్ కి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇదే కాకుండా, వేట, వ్యాధులు సోకడం, కాలుష్యం వంటి ఎన్నో పరిస్థితులు వాటి మరణానికి కారణం అవుతున్నాయి. అంతే కాకుండా కొన్ని జీవాలు మత్స్యకారుల వలల్లో చిక్కి మరణిస్తున్నాయి. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో 2022లో ప్రచురించబడిన ఒక పరిశోధనా వ్యాసంలో వివిధ రకాల ఫిషింగ్ నెట్‌లతో మెరైన్ లైఫ్ కు ఎంతో ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.
కేవలం ఫిషింగ్ నెట్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, అది పనామా దేశానికి సమానమైన వైశాల్యానికి సమానం. వదిలివేసిన ఫిషింగ్ నెట్‌లలో చిక్కుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఎన్ని Polar Bears చనిపోతున్నాయనే అంచనాలు లేనప్పటికీ, ఇతర జాతులపై వదలివేసిన ఫిషింగ్ నెట్‌ల ప్రభావం గురించి అనేక నివేదికలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ నెట్స్ కారణంగా ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి.
“Polar bear and cub saved from Tragic net trap.” అనే టైటిల్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మత్స్యకారులు ధృవపు ఎలుగుబంటిని రక్షించే వీడియో AI ద్వారా రూపొందించిన వీడియో.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసాం, మేము Pawsitive Vibes అనే ఛానెల్‌లో ప్రచురించబడిన Youtube వీడియోని కనుగొన్నాము. వివరణలో ఈ వీడియో ఎడిట్ చేసిన లేదా సింథటిక్ కంటెంట్‌ని కలిగి ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ధ్వని లేదా విజువల్స్ ను డిజిటల్‌గా రూపొందించారని అందులో ఉంది.
Full View
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసాం, మేము Pawsitive Vibes అనే ఛానెల్‌లో ప్రచురించబడిన Youtube వీడియోని కనుగొన్నాము. వివరణలో ఈ వీడియో ఎడిట్ చేసిన లేదా సింథటిక్ కంటెంట్‌ని కలిగి ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ధ్వని లేదా విజువల్స్ ను డిజిటల్‌గా రూపొందించారని అందులో ఉంది.
మేము ఇతర యూట్యూబ్ ఛానెల్‌లలో ప్రచురించిన ఇలాంటి వీడియోలను కూడా కనుగొన్నాము, తల్లి ఎలుగుబంటి ఆందోళన చెందుతున్నప్పుడు మత్స్యకారులు వల నుండి రక్షించారు.
ఇన్‌విడ్‌లో భాగమైన Hiya డిటెక్షన్ టూల్ అనే AI వీడియో డిటెక్షన్ టూల్‌ని ఉపయోగించి మేము వీడియోని తనిఖీ చేసినప్పుడు, వీడియో 95% AI ద్వారా రూపొందించబడినట్లు మేము కనుగొన్నాము. వీడియోలో AI ద్వారా సృష్టించిన ముఖాలు ఉన్నాయని సూచించే చాలా బలమైన సాక్ష్యాలు లభించాయి.
కరిగిపోతున్న మంచుకొండపై చిక్కుకున్న చిన్న పోలార్ బేర్ పిల్లను కొంతమంది వ్యక్తులు రక్షించడం కూడా కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది. అయితే అది AI ద్వారా రూపొందించారని స్పష్టంగా తెలిపింది. ఈ వీడియోలో, ఓడలోని వ్యక్తులు ఎలుగుబంటి పిల్లను రక్షించడం, కౌగిలించుకోవడం మనం చూడవచ్చు. AI డీప్‌ఫేక్ వీడియోలను ఎలా సృష్టిస్తోందో కూడా కథనం తెలియజేస్తుంది.
అందువల్ల, ఫిషింగ్ నెట్‌లో చిక్కుకున్న పోలార్ బేర్ వైరల్ వీడియో నిజం కాదు, దీన్ని AI ద్వారా రూపొందించారు. విడిచిపెట్టిన ఫిషింగ్ గేర్‌లలో పలు జంతువులు, ధృవపు ఎలుగుబంట్లు ఇరుక్కుపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వీడియో నిజమైన సంఘటన కాదు. వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు.
Claim : బిడ్డ తో పాటు ఉన్న Polar Bear వలలో చిక్కుకుపోగా మత్స్యకారులు దానిని రక్షించినట్లు వీడియో చూపిస్తుంది
Claimed By : Social media users
Fact Check : False