ఫ్యాక్ట్ చెక్: శ్రావణ మాసంలో రాహుల్ గాంధీ మాంసం తింటున్నాడంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు
రాహుల్ గాంధీ మాంసాహార కూరలతో రోటీ తింటూ, మరో వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ మాంసాహార కూరలతో రోటీ తింటూ, మరో వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న పోస్టులలో “सावन के पवित्र महीने में अपने आपको …दत्तात्रेय ब्राह्मण बताने वाला @RahulGandhi लेग पीस खा रहा है “ ఇలా ఉంది
తనను తాను బ్రాహ్మణుడు అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. శ్రావణ మాసంలో మాంసం తింటూ ఉన్నాడని విమర్శిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ లెగ్ పీస్ తింటున్నాడు అంటూ అందులో చెప్పుకొచ్చారు.
తనను తాను బ్రాహ్మణుడు అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. శ్రావణ మాసంలో మాంసం తింటూ ఉన్నాడని విమర్శిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ లెగ్ పీస్ తింటున్నాడు అంటూ అందులో చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
రాహుల్ గాంధీ సావన్ మాసంలో నాన్ వెజ్ తింటున్నట్లు వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో పాతది.. ఏప్రిల్ 22, 2023న ప్రచురించారు.
మేము “Rahul Gandhi eating” అనే కీవర్డ్‌లతో పాటు వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను సెర్చ్ చేసినప్పుడు.. ఏప్రిల్ 22, 2023న రాహుల్ గాంధీ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియోకు టైటిల్ “Dilli mein Chole Bature aur Mohabbat ka Sharbat I Rahul Gandhi I Interaction with Kunal Vijayakar” అని ఉంది. కునాల్ విజయ్ శంకర్ తో కలిసి ఢిల్లీలో పలు వంటకాలను రాహుల్ గాంధీ టేస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఈ వీడియోలో రాహుల్ గాంధీ హోస్ట్ కునాల్ విజయకర్‌తో కలిసి వివిధ రకాల ఆహారాన్ని రుచి చూశారు. యూట్యూబ్‌లో ప్రచురించబడిన ఒరిజినల్ వీడియో నుండి 12.43 - 13.29 నిమిషాల మధ్య వైరల్ వీడియోను తీసుకున్నారు.
ఇదే వీడియోను ఖానే మే క్యా హై అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రచురించింది, “Dilli ke Chole bhature, kabab aur Chatpati chat with Rahul Gandhi I Khaane mein kaun hai?" అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేశారు. యూట్యూబర్ కునాల్ విజయకర్ తో కలిసి రాహుల్ గాంధీ పలు వంటలను టేస్ట్ చేశారు. ఇంకొన్ని విషయాలను కూడా ఆయన మాట్లాడారు.
వీధుల్లో తినడం ఎప్పుడూ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది, కానీ ఈసారి రాహుల్ గాంధీ మాతో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఢిల్లీలో ఉన్నందుకు మేము గోల్ గప్పా, చోలే బతురే, తందూరీ చికెన్, కబాబ్స్, మొహబ్బత్ కా షర్బత్ వంటి ఎన్నో వంటకాలను మేము తిన్నాము అని కునాల్ చెప్పుకొచ్చారు.
2023 ఏప్రిల్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము, పరువు నష్టం కేసులో శిక్ష పడిన తర్వాత.. రాహుల్ గాంధీకి లోక్ సభ సభ్యత్వం తొలగించిన తర్వాత, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ కనిపించారు. గాంధీ వారసుడు ఓల్డ్ ఢిల్లీలోని మాటియా మహల్ మార్కెట్‌ను సందర్శించారు. స్థానిక దుకాణాలను కూడా సందర్శించారు. చాట్‌లు, అనేక ఇతర రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు.
రాహుల్ గాంధీ ఫుడ్ వాక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఏప్రిల్ 2023లో హిందుస్థాన్ టైమ్స్ షేర్ చేసింది.
ఈ వీడియో ఏప్రిల్ 2023 నాటిది అయితే, ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా శ్రావణ మాసం రెండు నెలలు ఉంది. జూలై 4, 2023 నుండి ఆగస్టు 31, 2023 వరకు కొనసాగనుంది.
రాహుల్ గాంధీ శ్రావణ మాసంలో మాంసాహారం తీసుకున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు. వీడియో పాతది.
Claim : Rahul Gandhi eating non-veg dishes in the month of Sawan
Claimed By : Social Media Users
Fact Check : False