ఫ్యాక్ట్ చెక్: పసిఫిక్ మహాసముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ వీడియోను బిపర్‌జాయ్ తుఫానుకు సంబంధించినదిగా తప్పుడు ప్రచారం
బిపర్‌జాయ్ తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. తుఫాను ప్రభావం పలు రాష్ట్రాలపై ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వరకూ గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాను క్రమంగా బలపడింది. ముంబై తీరంలో తుపాను ప్రభావం పెరుగుతోంది. ఇది సౌరాష్ట్ర-కచ్ తీరాలను కూడా తాకింది.
బిపర్‌జాయ్ తుఫాను కారణంగా విధ్వంసం జరిగిందంటూ.. అనేక పాత వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. బిపర్‌జాయ్ తుఫాను సమయంలో అరేబియా సముద్రంలో ఒక పడవకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు.

నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.ఈ వీడియో ఫిబ్రవరి 2023 నాటిది. ఇది యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్.. పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించినది.
మేము వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 2023లో ఒక రూకీ U.S. కోస్ట్ గార్డ్ స్విమ్మర్ సముద్రం నుండి ఒక వ్యక్తిని రక్షించారని గుర్తించాం. అప్పటి నుండి ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతూ ఉందని మేము కనుగొన్నాము.
ఈ వీడియోను ఫిబ్రవరి 3, 2023న USA టుడే షేర్ చేసింది, “రూకీ యుఎస్ కోస్ట్ గార్డ్ స్విమ్మర్ సముద్రంలో ఉన్న మనిషిని రక్షించాడు. ఆ సమయంలో వచ్చిన భారీ అలలు పడవ తిరగబడేలా చేశాయి." అని తెలిపింది.
ఈ వీడియోను AP ఆర్కైవ్ యూట్యూబ్ ఛానెల్ కూడా అదే శీర్షికతో షేర్ చేసింది. కోస్ట్ గార్డ్ స్విమ్మర్ చిన్న బోట్ లో ఉన్న వ్యక్తిని గుర్తించి సురక్షితంగా కాపాడారని వీడియో పేర్కొంది.
వీడియోను షేర్ చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఓరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కోస్ట్ గార్డ్ రెస్క్యూ స్విమ్మర్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడాడని పేర్కొంది.
వైరల్ అవుతున్న వీడియో అరేబియా సముద్రంలో చోటు చేసుకున్నది కాదు. పసిఫిక్ మహాసముద్రంలో పడవ మునిగిపోయిన వీడియోను వేరే వాదనలతో వైరల్ చేస్తూ ఉన్నారు. పడవలోని వ్యక్తిని యుఎస్ కోస్ట్ గార్డ్ రక్షించింది. అరేబియా సముద్రంలో బిపర్‌జాయ్ తుఫాను కు సంబంధించినది కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : Video shows boat in Cyclone Biparjoy
Claimed By : Twitter Users
Fact Check : False