ఫ్యాక్ట్ చెక్: పోస్టర్లలో భారత ప్రధాని, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు హాకీ ఆటగాళ్ల చిత్రాలు కూడా ఉన్నాయి.

భారత హాకీ జట్టు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను 2-1తో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత్‌కు హాకీలో వరుసగా కాంస్య పతకాలు అందాయి. మొదట టోక్యోలో, ఇప్పుడు పారిస్‌లో భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Update: 2024-08-24 09:07 GMT

Odisha government

భారత హాకీ జట్టు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను 2-1తో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత్‌కు హాకీలో వరుసగా కాంస్య పతకాలు అందాయి. మొదట టోక్యోలో, ఇప్పుడు పారిస్‌లో భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇండియా వర్సెస్ స్పెయిన్ ఒలింపిక్ కాంస్య పతక మ్యాచ్ అనంతరం భారత జట్టుకు పిఆర్ శ్రీజేష్ వీడ్కోలు పలికారు. అతను ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అద్భుతమైన ప్రదర్శన తర్వాత, పురుషుల హాకీ జట్టుకు భువనేశ్వర్ విమానాశ్రయంలో అభిమానులు, ఒడిశా ప్రభుత్వం నుండి ఘన స్వాగతం లభించింది. 

ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని చూపిస్తున్న చిత్రం వైరల్ అవుతూ ఉంది. "దేశాన్ని గర్వించేలా చేసినందుకు, పారిస్‌లో కాంస్యం, ఇంట్లో గర్వపడేలా చేసినందుకు భారత హాకీ హీరోలకు ధన్యవాదాలు" అనే టైటిల్ తో పోస్టర్ ఉంది. హాకీ ఆటగాళ్లు కాకుండా ప్రధాని, సీఎం ఫోటోలు వేపించుకోవడం పబ్లిసిటీ పిచ్చి తప్ప మరింకేమీ కాదంటూ విమర్శలు చేస్తున్నారు. పోస్టర్‌లో కనిపించే హీరోలు ఒలింపిక్స్‌లో హాకీ ఆడుతున్నట్లు కనిపించలేదు అనే వ్యంగ్య శీర్షికలతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా X (ట్విట్టర్)లో షేర్ చేస్తున్నారు.
“Salute to the Heroes of Indian Hockey Heroes : > Narendra Damodardas Modi > Mohan Charan Majhi” అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
ఇతర వినియోగదారులు “నాకు జ్ఞానం తక్కువే.. అందుకు క్షమించండి, ఇందులో శ్రీజేష్ ఎవరు.. హర్మన్‌ప్రీత్ ఎవరు” అంటూ కూడా పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఒడిశా ప్రభుత్వం విడుదల చేసిన పోస్టర్‌లో పురుషుల హాకీ జట్టు సభ్యుల ఫోటో కూడా ఉంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి వైరల్ చిత్రాన్ని శోధించగా.. వైరల్ చిత్రం పురుషుల హాకీ జట్టు గౌరవార్థం ఒడిశా ప్రభుత్వం విడుదల చేసిన అసలు పోస్టర్‌లో కొంత భాగాన్ని మాత్రమే చూపుతుందని కనుగొన్నాము. 
“Hello @CMO_Odisha @odisha_police @MohanMOdisha" ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన పూర్తి ప్రకటన ఉన్న X (ట్విట్టర్) పోస్ట్‌ను మేము కనుగొన్నాము. "@cpbbsrctc ఈ సీరియల్ ఫేక్ న్యూస్ పెడ్లర్ మా హాకీ టీమ్‌ను స్పాన్సర్ చేస్తున్న ఒడిశా రాష్ట్రం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, దయచేసి తగిన చర్య తీసుకోండి” అంటూ ఓ పోస్ట్ ఆగస్టు 23, 2024న ప్రచురించారు. దీన్ని బట్టి ఆ అకౌంట్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
మేము షేర్ చేసిన ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్క్రీన్‌షాట్‌లోని తేదీని గమనించగా.. అది ఆగస్ట్ 22, 2024 అని మేము కనుగొన్నాము. దీన్ని క్యూ గా తీసుకొని, మేము పూర్తి ప్రకటనతో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ-పేపర్ కోసం వెతికాము. 2024
ఆగస్టు 21,
ఆగస్టు 22న పురుషుల హాకీ జట్టు సభ్యులను స్వాగతిస్తూ ఒడిశా ప్రభుత్వం పూర్తి పేపర్ పోస్టర్‌ను ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.


CMO ఒడిశాకు సంబంధించిన X ఖాతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, పూర్తి భారతీయ హాకీ జట్టు చిత్రాలతో జట్టు సభ్యులను భారతదేశానికి స్వాగతించే పోస్టర్‌ను షేర్ చేసింది.

Newsonair.govలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు భువనేశ్వర్ విమానాశ్రయంలో అభిమానులు, ఒడిశా ప్రభుత్వం నుండి ఘన స్వాగతం లభించింది. ఒడిశా క్రీడా మంత్రి సూర్యబన్షి సూరజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, భాస్కర్ జ్యోతి శర్మ, ఇతర ప్రభుత్వ అధికారులు, హాకీ ఇండియా ప్రెసిడెంట్ డా. దిలీప్ కుమార్ టిర్కీ, కోశాధికారి శేఖర్ జె.మనోహరన్‌లతో కలిసి విమానాశ్రయంలో హాకీ బృందానికి స్వాగతం పలికారు.
భువనేశ్వర్‌లో ఒలంపిక్ వైభవాన్ని పురస్కరించుకుని భారత హాకీ జట్టు కోసం ఓపెన్-టాప్ బస్ పరేడ్‌తో సత్కరించింది. దీని తరువాత, ఛాంపియన్ల కోసం వాక్ ఆఫ్ ఫేమ్ నిర్వహించారు. తరువాత ఐకానిక్ కళింగ స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరిగింది.
టెలిగ్రాఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ 2036 వరకు భారతీయ హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని ప్రకటించారు. ఒడిశా ప్రభుత్వం 2033 వరకు భారత హాకీ జట్లకు పురుషులు, మహిళలకు అధికారిక స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు దానిని మరో మూడు సంవత్సరాలు పొడిగించారు.
కాబట్టి, ఒడిశా అధికారులు విడుదల చేసిన పోస్టర్‌లో కేవలం భారత ప్రధాని, ఒడిశా ముఖ్యమంత్రి చిత్రాలే కనిపిస్తున్నాయని.. వీరు భారత హాకీ జట్టులోని నిజమైన హీరోలు కాదని ప్రచారంలో ఉన్న వైరల్ చిత్రం తప్పుదారి పట్టిస్తోంది. వార్తాపత్రికలలో ప్రచురించిన పూర్తి పోస్టర్ ను కట్ చేసి.. తప్పుదారి పట్టించే వాదనతో వైరల్ చేస్తూ ఉన్నారు.
Claim :  హాకీ జట్టుకు కృతజ్ఞతలు తెలిపే పోస్టర్‌లో భారత ప్రధాని, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాలు మాత్రమే ఉన్నాయి, ఆటగాళ్ల ఫోటోలు లేవు.
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News