ఫ్యాక్ట్ చెక్: ముకేశ్ అంబానీ ఇచ్చిన పార్టీలో 500 రూపాయల నోటును టిష్యూ పేపర్ గా ఉపయోగించలేదు

NMACC - నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ ను ఏప్రిల్ 1, 2023న అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్, హాలీవుడ్ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతదేశం గొప్ప సాంస్కృతిక చరిత్రను NMACC ప్రారంభం కార్యక్రమంలో ప్రదర్శించారు.

Update: 2023-04-15 11:00 GMT
NMACC - నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ ను ఏప్రిల్ 1, 2023న అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్, హాలీవుడ్ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతదేశం గొప్ప సాంస్కృతిక చరిత్రను NMACC ప్రారంభం కార్యక్రమంలో ప్రదర్శించారు.ఈవెంట్‌కు వచ్చిన అతిథులు పలు చిత్రాలను షేర్ చేశారు. కరెన్సీ నోట్లతో అలంకరించబడిన డెజర్ట్ ప్లేట్‌ వైరల్ అయింది. టిష్యూ పేపర్‌కు బదులుగా 500 రూపాయల నోట్లను అందించారనే వాదనతో షేర్ చేశారు.“అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కి జగహ్ 500 కే నోట్స్ హోతే హై” అనే వాదనతో ఈ చిత్రం వైరల్‌గా మారింది. అంబానీలు ఇచ్చే పార్టీలో టిష్యూ పేపర్లకు బదులుగా 500 రూపాయల నోట్లను ఇచ్చారనే వాదనతో పోస్టులు షేర్ చేశారు.
Full View
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

డిష్‌పై ఉన్న 500 రూపాయల నోట్లు నకిలీవి. ఈ వంటకాన్ని దౌలత్ కి చాట్ అంటారు.మేము "అంబానీ పార్టీ 500 నోట్స్" అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, గ్రాండ్ ఈవెంట్ గురించి ప్రచురించిన అనేక కథనాలను మేము కనుగొన్నాము.ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఈ వైరల్ పోస్టుల్లో కనిపించే ఆహార పదార్థాన్ని దౌలత్ కి చాట్ అని పిలుస్తారు, ఇది ఉత్తర భారతదేశంలో ఎంతో మంది ఇష్టపడే వంటకం. దానిపై నకిలీ నోట్లు ఉంచుతారు.
మేము 'దౌలత్ కి చాట్' గురించి శోధించాము. ఓల్డ్ ఢిల్లీకి చెందిన ఫేమస్ ఫుడ్ గురించి మాకు కొన్ని కథనాలు దొరికాయి.ఢిల్లీలోని చెఫ్‌లు నకిలీ నోట్లను ఈ స్వీట్ అలంకరణగా ఉపయోగిస్తారని స్క్రోల్‌లో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది.నటి ప్రియాంక చోప్రా కూడా నవంబర్ 2019లో ఈ వంటకాన్ని ఆస్వాదిస్తున్న చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఆమె నిజమైన డబ్బును వృధా చేసిందని అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చాయి.తాజా సమాచారం ప్రకారం, ఆ వంటకాన్ని నకిలీ కరెన్సీతో అలంకరించారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ నోట్‌లను దగ్గరగా చూస్తే అవి నకిలీవని మనం గుర్తించవచ్చు.

https://www.latestly.com/entertainment/bollywood/priyanka-chopra-posts-a-pic-with-delhis-popular-dessert-daulat-ki-chaat-trolls-confuse-it-for-real-daulat-see-pics-1318296.html

అలంకరించిన నోట్లు నిజమైన 500 రూపాయల నోట్లను పోలి లేవని మేము కనుగొన్నాము. వైరల్ ఇమేజ్‌లో కనిపించే కరెన్సీ నోట్లు సాధారణ నోట్ల కంటే చాలా పెద్దవి. వైరల్ ఇమేజ్‌లోని నోట్లపై “₹500”, 'రెడ్ ఫోర్ట్' అన్నవి కనిపించలేదు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన 500 రూపాయల నోటుకు సంబంధించిన అసలు ఫీచర్లను తనిఖీ చేయండి.NAMCC ఈవెంట్‌లో అతిథులకు ఇచ్చిన స్వీట్లపై కనిపించిన నోట్లు నిజమైన 500 రూపాయల నోట్లు కావు. అవి నకిలీవి. ఢిల్లీకి చెందిన ‘దౌలత్ కి చాట్’ అనే వంటకాన్ని నకిలీ నోట్లతో డెకరేట్ చేస్తారు. అంబానీ పార్టీలో కరెన్సీ నోట్లను టిష్యూ పేపర్లుగా ఉపయోగించారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim :  Ambanis served 500 rupee notes with dessert
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News