ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి అనుమానాస్పద కంటెయినర్ వాహనం వెళ్ళిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అనుసరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అనుసరిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా లోకేష్ కాన్వాయ్ వాహనాలను పోలీసు అధికారులు తనిఖీ చేశారు.
ఆ తర్వాత కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలోకి అనుమానాస్పద కంటైనర్ ప్రవేశించినట్లు పేర్కొంటూ కొన్ని చిత్రాలు, వీడియోలను పంచుకున్నాయి. భద్రతా సిబ్బంది కంటైనర్‌లో సోదాలు చేయలేదు.. వారు దానిని ఆపలేదని తెలిపాయి. సీఎం క్యాంపు కార్యాలయానికి ఆ కంటైనర్ డబ్బు లేదా డ్రగ్స్ సరఫరా చేసి ఉండొచ్చని ఊహాగానాలు వినిపించాయి.
“*Most Suspicious News* *అనుమాస్పదంగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి కంటెయినర్ వాహనం* *వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, బయటకు వాహనం* *భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని కంటెయినర్ వాహనం వివరాలు* *గంట తర్వాత వచ్చినదారిలోనే వేగంగా బయటకు వెళ్లిన కంటెయినర్* *కంటెయినర్ ఎందుకు వచ్చింది.. వ్యతిరేక మార్గంలో వెళ్లడంపై పలు తీవ్ర అనుమానాలు* *వ్యతిరేక మార్గంలో వెళ్తున్నా భద్రతా సిబ్బంది ఆపకపోవడంపై పలు సందేహాలు* *AP 16 Z 0363 నంబరుతో వచ్చిన వాహనంపై పోలీసు స్టిక్కర్* *ఇప్పటికే 4 సార్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు ఈ AP 16 Z 0363 వాహనాన్ని దగ్గరుండి సాగనంపడం పై తీవ్ర అనుమానాలు*” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ ప్రవేశించిందన్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. వాహనంలో వంటలకు సంబంధించిన సామాగ్రి ఉంది.
‘సీఎం @ysjagan బస్సుయాత్ర సందర్భంగా దారిలో ఆహారాన్ని తయారు చేసుకునే పాంట్రీ వాహనం.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే.. ఆ వాహనంపై రామోజీ పచ్చ మీడియాలో దుష్ప్రచారం.’ అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న వాదనలను ఖండిస్తూ.. Sakshi TV యూట్యూబ్ ఛానల్ లో వీడియోలను పోస్టు చేశారు.
అనేక ప్రభుత్వ కార్యాకలాపాలు సీఎం క్యాంపు కార్యాలయం నుండి నడుస్తున్నాయని, ఆ వాహనం కార్యాలయాలకు సరుకులను రవాణా చేసి ఉండవచ్చని వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు ది హిందూలో కథనం కూడా ప్రచురితమైంది.
సిఎం క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన కంటైనర్ ప్యాంట్రీ వ్యాన్. అనుమానాస్పదమైన వాహనం కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : A suspicious container entered the Andhra Pradesh CM camp office
Claimed By : Social media users, mainstream media
Fact Check : Misleading