ఫ్యాక్ట్ చెక్: వెటరన్ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ చనిపోలేదు. బ్రతికే ఉన్నారు.

టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఆల్-టైమ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్‌లో తన పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.

Update: 2024-07-22 10:28 GMT

టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఆల్-టైమ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్‌లో తన పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. నోవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ మధ్య జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్‌కు వేల్స్ యువరాణితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎనిమిది సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఆండ్రీ అగస్సీ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.

ఆండ్రీ అగస్సీ, స్టెఫీ గ్రాఫ్ ఒక ఐకానిక్ టెన్నిస్ జంట. వీరు ఒక దశాబ్దం పాటు టెన్నిస్ గేమ్‌ను శాసించారు. అయితే స్టెఫీ గ్రాఫ్ చనిపోయిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం షేర్ చేస్తున్నారు. దానిని
స్టెఫీ గ్రాఫ్ అనే పబ్లిక్ గ్రూప్
షేర్ చేసింది.
పోస్ట్ ద్వారా ఇచ్చిన లింక్‌పై మేము క్లిక్ చేయగా, sportybird247.comలో ప్రచురించిన వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము. “SAD NEWS: స్టెఫానీ మరియా గ్రాఫ్, జర్మన్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి 55 సంవత్సరాల వయస్సులో మరణించారు” అని అందులో ఉంది.
జూలై 17, 2024న ప్రచురించిన కథనంలో టెన్నిస్‌లో ఆమె సాధించిన విజయాలను తెలియజేశారు. ఆమె చనిపోయారని అందులో పేర్కొన్నారు. కానీ ఆమె మరణానికి గల కారణాల గురించి ప్రస్తావించలేదు. మరణించిన తేదీ లేదా ఇతర వివరాల ప్రస్తావన కూడా మాకు అందులో దొరకలేదు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. స్టెఫీ గ్రాఫ్ ఇంకా బతికే ఉన్నారు. ఆ వార్తా కథనం క్లిక్‌బైట్ కిందకు వస్తుంది.

మేము వెబ్‌సైట్‌ను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, "విచారకరమైన వార్తలు..."తో ప్రారంభమయ్యే శీర్షికలతో అనేక కథనాలు ఉన్నాయని గుర్తించాం. వెబ్‌సైట్‌లోని ప్రధాన కథనాలలో ఎక్కువ భాగం విమాన ప్రమాదాల కారణంగా ఆటగాళ్ల మరణాలకు సంబంధించినవే ఉన్నాయి.

 వెబ్‌సైట్ ప్రామాణికతను నిర్ధారించడానికి
అబౌట్ అజ్ పేజీలో
నమ్మదగిన సమాచారం లేదు.
మేము ఈ వెబ్‌సైట్ డొమైన్ వివరాలను Whois డొమైన్ టూల్స్‌లో వెతికినప్పుడు, మాకు సైట్ గురించి నమ్మదగిన సమాచారం కూడా కనిపించలేదు.

స్టెఫీ గ్రాఫ్‌కి సంబంధించిన వార్తా కథనాల గురించి మరింత వెతికాం. ఏ ప్రముఖ మీడియా సంస్థ కూడా ఆమె మరణించినట్లుగా కథనాన్ని ప్రచురించలేదు. ఎసెన్షియల్లీ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. ఆండ్రీ అగస్సీ, స్టెఫీ గ్రాఫ్‌ల జంట గురించి ప్రచురించారు. 20వ శతాబ్దపు చివరి రెండు దశాబ్దాలలో వారు సాధించిన విజయాలపై స్పందించారు. 1992లో వింబుల్డన్‌లో కలుసుకున్నారని తెలిపారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది.
అందువల్ల, sportybird247.com వెబ్‌సైట్ ప్రచురించిన వార్తా కథనం క్లిక్‌బైట్ కథనం. తప్పుడు కథనాలతో క్లిక్‌లను సొంతం చేసుకోడానికి చేసే ప్రయత్నంలో ఇదీ ఒక భాగం. స్టెఫీ గ్రాఫ్ చనిపోయిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ప్రముఖ టెన్నిస్ స్టార్ స్టెఫీ గ్రాఫ్ 55 ఏళ్ల వయసులో మరణించారు
Claimed By :  Facebook User
Fact Check :  False
Tags:    

Similar News