ఫ్యాక్ట్ చెక్: మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడలేదు..!

మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడింది అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. అందులో ఓ రథం కనిపించింది.

Update: 2022-12-05 11:00 GMT

మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడింది అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. అందులో ఓ రథం కనిపించింది.

Full View

"విదేశాల్లో బయటపడ్డ మహా భారత రథం ప్రపంచ దేశాల్లో ఎక్కడ తవ్వకాలు ప్రారంభించినా అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన పురాతన దేవతా విగ్రహాలు కానీ ఏదో ఒకటి బయట పడుతున్నాయి" అంటూ పోస్టులు పెట్టారు. వాటిని అక్కడ ఉన్న మనుషులు ఎంతో తీక్షణంగా గమనిస్తూ వచ్చారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

మేము వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. చైనాలోని యాంగ్ నగరానికి సమీపంలో ఉన్న "యిన్ జు" మ్యూజియంలో ఉన్నట్లు కనుగొన్నాము. మేము ఇలాంటి మరిన్ని వీడియోలను కూడా కనుగొన్నాము.
Full View
Full View
చైనీస్ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, "యిన్ జు" ప్రాంతం చైనాలోని పురాతన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. 19వ శతాబ్దం నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. 3,300 సంవత్సరాల క్రితం నాటి వస్తువులు, ఎముకలు, ఆభరణాలు, రథాలు మ్యూజియంలో చూడవచ్చు. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యకాలం వరకు పాలించిన 'షామిద్-11' పాలనకు సంబంధించిన ఇతర వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడి మనుషుల ఎముకలతో పాటు రథ చక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభ్యమయ్యాయి.
https://whc.unesco.org/en/list/1114/
ఈ మ్యూజియంలో భద్రపరచబడిన అనేక రథాల ఫోటోలను కూడా మేము కనుగొన్నాము.
https://whc.unesco.org/en/list/1114/gallery/
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. చైనీస్ మ్యూజియంలో ఉన్న 3,300 సంవత్సరాల నాటి షాంగ్ రాజవంశం రథచక్రం మహాభారత కాలం నాటిదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
Claim :  Remnants of the Mahabharata chariot unearthed during excavations abroad
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News