వరద నీటిలో వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియో 2020 నాటిది, జోధ్‌పూర్ లో ఇటీవల కాలంలో తీసినది కాదు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఇటీవల వచ్చిన వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ కనిపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిని స్థానికులు రక్షించిన దృశ్యాలను కూడా ఆ వీడియోలో చూడవచ్చు.

Update: 2022-08-02 15:21 GMT

దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, అనేక నగరాలు వరదలను ఎదుర్కొంటున్నాయి. ఇళ్లల్లో, వీధుల్లో నీరు ప్రవహిస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఈ వీడియోలలో కొన్ని ఇప్పటి వరదలవి అయితే, కొన్ని పాత వీడియోలు విభిన్న శీర్షికలతో షేర్ చేయబడుతున్నాయి.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఇటీవల వచ్చిన వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ కనిపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిని స్థానికులు రక్షించిన దృశ్యాలను కూడా ఆ వీడియోలో చూడవచ్చు. వీఅడియో హిందీ కథనంతో షేర్ చేయబడింది. ఆ కధనం " Jodhpur में भयंकर बारिश बनी आफत, पानी के तेज बहाव में बहे लोग!" అనువదించినప్పుడు "జోధ్‌పూర్‌లో భారీ వర్షాలు, అధిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రజలు!"

Full View
Full View

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో ఇటీవల జోధ్‌పూర్‌ లో వచ్చిన వరదలను చూపుతుంది అనే వాదన అబద్దం.

ఇన్‌విడ్ టూల్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, అనేక మీడియా వెబ్‌సైట్‌లలో ప్రచురించిన వీడియోలను చూడవచ్చు.

ఆగస్ట్ 2020లో టివి9 భరత్ వర్ష్, సిఎనెన్-న్యూస్18 షేర్ చేసిన వీడియోల లింక్‌లు ఇక్కడ ఉన్నాయి. టివి9 భరత్ వర్ష్ ప్రచురించిన వీడియో వివరణ "జైపూర్ లో భారీ వర్షాలు..రోడ్లపై వరద నీరు."

Full View

సి ఎన్ ఎన్-న్యూస్ 18 వీడియో వివరణ "భారీ వర్షాలు జైపూర్‌ను అనేక ప్రాంతాలలో వరద స్తంభింపజేశాయి. ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు, వీధి నీటితో నిండిపోవడంతో స్థానికులు అతనిని రక్షించారు."

Full View

ఇండీయనెక్స్ ప్రెస్.కాం లోని ఒక కథనం ప్రకారం, మూడు గంటలపాటు కురుసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా జలమయమయ్యాయి. అనేక వాహనాలు నీటిలో మునిగిపోతున్న షాకింగ్ వీడియోలు సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల బలమైన నీటి ప్రవాహాల వల్ల ప్రజలు కాళ్ల మీద నిలబడలేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, బస్సుల్లో నీరు నిండిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పలు గుడిసెలు కొట్టుకుపోయాయి.

కాబట్టి, వైరల్ వీడియో జోధ్‌పూర్‌లో ఇటీవలి వరదల లొ తీసింది కాదు, ఇది ఆగస్టు 2020, జైపూర్ నగరంలో వరదలను చూపుతుంది. దావా అబద్దం.

Claim :  video of man being swept away in flood water in Jodhpur, Rajasthan
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News