ఫ్యాక్ట్ చెక్: ఒక ముస్లిం మహిళ బస్సు ఆపమంటే ఆపనందుకు రోడ్డుపై గొడవ చేస్తున్నారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు
ఒక ముస్లిం మహిళ బస్సును ఆపడానికి ప్రయత్నించగా.. అందుకు బస్సు కండక్టర్ ఒప్పుకోలేదు. దీంతో బస్సును ఆపకపోవడంతో కర్ణాటక ప్రజలు బస్సులను ధ్వంసం చేస్తున్నారని
ఒక ముస్లిం మహిళ బస్సును ఆపడానికి ప్రయత్నించగా.. అందుకు బస్సు కండక్టర్ ఒప్పుకోలేదు. దీంతో బస్సును ఆపకపోవడంతో కర్ణాటక ప్రజలు బస్సులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఓ గుంపు ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వీడియో వైరల్ అయింది. ఒకరిపై ఒకరు అరుస్తూ బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై రాళ్లు రువ్వడం చూడవచ్చు.
“*ఇది ఎక్కడో అమెరికా, పాకిస్తాన్, చైనా, జపాన్ దేశాలలో జరిగిందనుకునేరు. కానే కాదు. మన ప్రక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగింది, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రవేశపెట్టింది కదా. ఒక ముస్లిం మహిళ బస్సు ఆపమంటే కండక్టర్ ఆపనందుకు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారు.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన చోటు చేసుకుంది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి.. వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూలై 05, 2019న ‘The Quint’ ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము.
గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగినట్లు కథనం పేర్కొంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగిందని అందులో తెలిపారు. దేశంలో జరుగుతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ ర్యాలీ నిర్వహించాలని భావించారు. అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేశారు. పోలీసుల మీద దాడికి తెగబడ్డారు. ఆర్టికల్ లో షేర్ చేసిన వీడియో కూడా.. వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్‌ను చూపుతుంది.
జూలై 05, 2019న ABP అస్మిత ప్రచురించిన వీడియోలో కూడా కొందరు వ్యక్తులు రోడ్డుపై హింసకు దిగినటువంటి ఇలాంటి దృశ్యాలే ఉన్నాయి. వీడియో వివరణలో “గుజరాత్‌లోని సూరత్‌లో మూక హత్యలకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత ధర్నా అకస్మాత్తుగా హింసాత్మకంగా మారింది. రాళ్ళ దాడికి తెగబడడంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు" అని ఉంది.
జులై 5, 2019న ఏఎన్ఐ లో కూడా ఇదే ఆర్టికల్ ను పోస్టు చేశారు. నాన్ పురా ప్రాంతంలో ఓ గుంపు చేసిన దాడిలో 4-5 మంది పోలీసులు గాయపడ్డారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో పోలీసుల మీదకు దాడులకు తెగబడ్డారు. దీంతో 144 సెక్షన్ ను అమలుచేయాల్సి వచ్చింది.
ఆగస్ట్ 2023లో హర్యానాలో హింసాకాండ జరిగినప్పుడు కూడా ఈ వీడియో వైరల్ అయింది. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఈ వీడియోను ఖండించాయి.
ఓ గుంపు రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేసిన వైరల్ వీడియో కర్ణాటకకు సంబంధించినది కాదు. గుజరాత్‌లోని సూరత్ లో 2019లో చోటు చేసుకున్నది. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : The video shows an incident in Karnataka, where the government is running a free bus service for women
Claimed By : Social media users
Fact Check : Misleading