అమెరికాలోని వైట్‌హౌస్‌లో శ్రీ రుద్రం పారాయణం జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి

విదేశీయులు వేద శ్లోకాలు పఠిస్తున్నట్లు చూపుతున్న రెండు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అయిన వైట్‌హౌస్‌లో శ్రీ రుద్రం పఠనాన్ని చూపుతున్నాయనే వాదనతో షేర్ చేస్తున్నారు.

Update: 2023-09-07 07:19 GMT

విదేశీయులు వేద శ్లోకాలు పఠిస్తున్నట్లు చూపుతున్న రెండు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అయిన వైట్‌హౌస్‌లో శ్రీ రుద్రం పఠనాన్ని చూపుతున్నాయనే వాదనతో షేర్ చేస్తున్నారు.

అమెరికాలోని వైట్‌హౌస్‌లో "శ్రీ రుద్రం స్తోత్రం" పఠిస్తున్నారనే వాదనతో కొందరు వేద స్తోత్రాలను పఠిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. సాధారణంగా అమెరికన్స్ అంత స్పష్టంగా ఇలాంటి స్తోత్రాలను పలకడం కష్టమని.. అయినా వాళ్లు ఎంతో గొప్పగా పఠిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. కళ్లు మూసుకుని వినండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ కింద అందుకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి:


Full View


Full View


ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని వైట్‌హౌస్‌లో నిర్వహించారనే వాదనతో ఇద్దరు వ్యక్తులు నిలబడి వేదికపై వేద శ్లోకాలు ఆలపిస్తున్న మరో వీడియో కూడా ప్రచారంలో ఉంది. ఆ వీడియోలో ఒక మహిళ స్టీవ్ బర్డిక్ అని.. మరొకరిని జెఫ్రీ ఎర్హార్డ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఆది శంకరాచార్య జయంతిని పురస్కరించుకుని వైట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీ రుద్రం స్తోత్రం పఠించారనే వాదనతో వీడియోను షేర్ చేశారు. “Shree Rudram stotram was recited at a function in White House USA to celebrate Aadi Shankaracharya Jayanti. No one could have imagined that an American like Jeffery Arhard and his friend could recite it with very clear pronunciation and intonation. Really Good!” అంటూ పోస్టులు పెట్టారు.
Full View

Full View


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. విదేశస్థులు శ్రీరుద్ర పారాయణం చేస్తున్న వీడియోలు నిజమే అయినా.. వైట్ హౌస్ లో ఇది చోటు చేసుకోలేదు.

మొదటి వీడియోకు సంబంధించి.. మేము వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. సెప్టెంబర్ 2019లో అప్లోడ్ చేసిన Facebook వీడియోని కూడా మేము కనుగొన్నాము.
“Shri Rudram and Chamakam performed by 400+ Europeans in Croatia. The European Veda Association would be performing this across many places in Europe for world peace. Amazing! Absolutely proud to be born in the lineage of Vedic tradition. Looks like others are picking up where we left it.” అంటూ ఫేస్ బుక్ లో వీడియోను అప్లోడ్ చేశారు. క్రొయేషియాలో 400 మందికి పైగా యూరోపియన్లు శ్రీరుద్రం, చమకాన్ని ఆలపించారని వీడియోలలో తెలిపారు. యూరోపియన్ వేదిక్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Full View
దీని నుండి క్యూ తీసుకొని, “Sri Rudram chanting by 400+ Europeans” అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఆగస్ట్ 2018లో ప్రచురించిన మరో YouTube వీడియో మాకు కనిపించింది.
Full View

తదుపరి శోధనలో, మేము Vedaunion.org వెబ్‌సైట్‌ను కనుగొన్నాము. ఇది అన్ని యూరోపియన్ వేద పఠన సమూహాలను ఏకం చేసే నెట్‌వర్క్ అని గుర్తించాం.

ఈ సంస్థ ‘రుద్రం 11’ పేరుతో వేదా యూనియన్ ప్రాజెక్ట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో మార్చి 3- 4, 2018న నిర్వహించారు. వైరల్ వీడియోను పోలిన చిత్రాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

స్టీవ్ బర్డిక్, జెఫ్రీ ఎర్హార్డ్ శ్రీ రుద్రం జపిస్తున్నట్లు చూపించే రెండవ వీడియో కూడా పాతది. ఈ వీడియో జనవరి 31, 2015న లెమోంట్, ILలోని హిందూ దేవాలయం ఆఫ్ గ్రేటర్ చికాగోలో జరిగిన మహారుద్రం కార్యక్రమాన్ని చూపుతుంది.

asianmediaUSA.com వెబ్‌సైట్‌లోని పత్రికా ప్రకటన ప్రకారం, ఈ ఈవెంట్ లో శ్రీ రుద్రం ప్రదర్శన హైలైట్‌ గా నిలిచింది. స్టీవ్ బర్డిక్, జెఫ్రీ ఎర్హార్డ్ ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ప్రశంసించారు. ఎర్హార్డ్ భజనలతో అలరించారు.

వైట్‌హౌస్‌లో శ్రీ రుద్రం పారాయణం జరిగినట్లు వైరల్ అవుతున్న వీడియోలు పాతవి. అమెరికాలోని వైట్‌హౌస్‌లో జరిగిన సంఘటనలు కావు. వైరల్ వీడియో.. రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.


Claim :  Videos show Sri Rudram being recited in the White House in America
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News