నిజ నిర్ధారణ: శబరిమల ఆలయాన్ని సందర్శించిన వీఐపీ కేరళ గవర్నర్ ఆరిఫ్, ప్రధాని మోదీ కాదు

శబరిమల ఆలయాన్ని సందర్శించి, ఇరుముడి తలపై మోస్తున్న వీఐపీ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది, ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు చూపుతున్నారు.

Update: 2022-12-20 09:23 GMT

శబరిమల ఆలయాన్ని సందర్శించి, ఇరుముడి తలపై మోస్తున్న వీఐపీ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది, ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు చూపుతున్నారు.

"ఎటువంటి ప్రకటన లేకుండా ఇరుముడితో ప్రధాని మోదీ శబరిమల దర్శనం" అని తెలుగులో క్లెయిమ్ వెళుతుంది.

Full View


Full View


Full View


Full View


Full View

ఈ వాదన ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

నిజ నిర్ధారణ:

వాదన అబద్దం. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భారత ప్రధాని మోదీ కాదు, కేరళ గవర్నర్ ఆలయాన్ని సందర్శిస్తున్నారు, ఇది ఒక సంవత్సరం క్రితం ప్రచురించబడింది.

వీడియో కుడి ఎగువ మూలలో ఎం7 వార్తల లోగోను గమనించాము. క్యూ తీసుకొని, ం7 న్యూస్ కేరళలో శోధించినప్పుడు, ఎం7 న్యూస్ యూట్యుబ్ ఛానెల్, వెబ్ ఆధారిత వార్తా ఛానెల్‌ లభించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమలను సందర్శించారు అనే వీడియో ఏప్రిల్ 11, 2021న ప్రచురించారు.

Full View

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమలను సందర్శించినట్లు వీడియో వివరణలో ఉంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పంపా, కేతుమేంటి నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా వచ్చారు. శబరిమల దర్శనానికి వచ్చిన గవర్నర్‌కు కేఎస్ రవి, దేవస్వామ్ కమిషనర్ బీఎస్ తిరుమేణి పెద్ద నడకదారి ఎదురుగా స్వాగతం పలికారు. అనంతరం మలికప్పురం ఆలయ ఆవరణలో గవర్నర్ శ్రీగంధం మొక్కలు నాటారు. అనంతరం పుణ్యం పూంకవనం ప్రాజెక్టులో భాగంగా జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళారు. గవర్నర్‌తో పాటు ఆయన చిన్న కుమారుడు కబీర్‌ మహమ్మద్‌ ఖాన్‌ కూడా అయ్యప్పకు పూజలు చేసేందుకు వచ్చారు.

శబరిమల పుణ్యం పూంకవనం ప్రాజెక్ట్‌లో భాగంగా క్లీనింగ్‌లో గవర్నర్ పాల్గొన్న మరో వీడియో కూడా అదే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించారు.

Full View

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వీడియోలో అవే విజువల్స్‌ లభించాయి, వివరణలో "ఏప్రిల్ 10 నుండి నెలవారీ పూజ, విష్ణువు పండుగ కోసం శబరిమల ఆలయం తెరిచిన తరువాత, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రార్థనలు చేయడానికి ఏప్రిల్ 11 న ఆలయ సముదాయాన్ని సందర్శించారు."

స్థానిక వార్తా వెబ్‌సైట్‌లు కూడా ఈ వార్తలను ప్రసారం చేశాయి.

అందుకే, భారత ప్రధాని మోదీ అకస్మాత్తుగా శబరిమల ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తున్నట్టు వైరల్ వీడియో చూపింస్తోందన్న క్లెయిం అబద్దం. ఈ వీడియో 2021 సంవత్సరం లో తీసినది, ఇందులో ఉన్న వ్యక్తి కేరళ గవర్నర్‌, ప్రధాని నరేంద్ర మోడీ కాదు.

Claim :  Modi visited Sabarimala without prior notice
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News