ఫ్యాక్ట్ చెక్: అమూల్ సంస్థ 'షరమ్' అనే చీజ్ ప్యాక్ AI ను వాడి తయారు చేసారు

మధ్యవర్తుల దోపిడీని అడ్డుకోడానికి కొంతమంది రైతులు స్థాపించారు అమూల్ సంస్థను. ఈ సంస్థ దేశంలోని డెయిరీ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. అమూల్ పేద రైతుల జీవితాలను కూడా మార్చేసింది. అనేక సంవత్సరాల నుండి నాణ్యమైన డైరీ ప్రోడక్ట్స్ ను అందిస్తూ ఉన్న ఈ బ్రాండ్ కు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది.

Update: 2023-12-25 09:46 GMT

 Amul Sharam Cheese

మధ్యవర్తుల దోపిడీని అడ్డుకోడానికి కొంతమంది రైతులు స్థాపించారు అమూల్ సంస్థను. ఈ సంస్థ దేశంలోని డెయిరీ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. అమూల్ పేద రైతుల జీవితాలను కూడా మార్చేసింది. అనేక సంవత్సరాల నుండి నాణ్యమైన డైరీ ప్రోడక్ట్స్ ను అందిస్తూ ఉన్న ఈ బ్రాండ్ కు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది.

అమూల్ సంస్థ ఛీజ్ ను తీసుకుని వచ్చిందని చెబుతూ.. ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'షరమ్' అని పేరు ఉన్న జున్నును అమూల్ సంస్థ విడుదల చేసిందని చెబుతున్నారు. ‘అబ్ షరమ్ నామ్ కి చీజ్ బజార్ మే మిల్తీ హై. ధన్యవాదాలు అమూల్'. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. షరమ్ అనే పేరు ఉన్న చీజ్ బజారులో దొరుకుతోందని సెటైరికల్ గా చెబుతూ ఉన్నారు.



Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ చిత్రంలో నిజమైన అమూల్ ఉత్పత్తి కాదు. వైరల్ అవుతున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు.

‘అమూల్ షరమ్ చీజ్’ అనే కీ వర్డ్స్ తో గూగుల్‌లో వెతికినప్పుడు, అమూల్ సంస్థ ఈ వాదనలను తోసిపుచ్చినట్లు వార్తా కథనాలు వచ్చాయి.

livemint.com ప్రకారం, అమూల్ సోషల్ మీడియా సైట్ X (ట్విట్టర్)లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది: "అమూల్ ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేశారు: వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ సందేశం ఫార్వార్డ్ చేస్తున్నారు. కొత్త రకం అమూల్ చీజ్ వచ్చిందని అందులో చెబుతున్నారు. పోస్ట్ సృష్టికర్త అమూల్ నుండి ఎటువంటి అనుమతి లేకుండానే రూపొందించారు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు."

"Issued in public interest by Amul: This is for your kind information that a fake message is being forwarded on WhatsApp and Social Media platforms regarding new type of Amul Cheese. The creator of the post has made the creative and posted this without any authorization from Amul." అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.

అమూల్ వివరణ ఇచ్చిన తర్వాత.. Ankit Sawant అనే ట్విట్టర్ యూజర్ తాను ఈ ఫోటోను క్రియేట్ చేసానని ఒప్పుకున్నారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయాలని తాను అనుకోలేదని.. కేవలం నవ్వు తెప్పించేందుకు మాత్రమే తాను ఈ ప్రయత్నం చేశానని అన్నారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు అంకిత్. “Not something which I intended. I am sorry @Amul_Coop. Took me a min to make this, makes me realise how terrifyingly simple it is to create fake news!” అంటూ ట్విట్టర్ లో పోస్టు చూశాం.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో AI ద్వారా రూపొందించారు. అసలైన అమూల్ ఉత్పత్తి కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  Image shows Amul product named Sharam cheese
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News