ఫ్యాక్ట్ చెక్: జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న వీడియో ఇటీవలిది కాదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13, 2024న ఎన్నికలు జరిగాయి. అధికార YSRCP, ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో రాళ్లదాడులు, ఆస్థుల దహనం, దాడులకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. మాచర్ల, గురజాల, తాడిపత్రి నియోజకవర్గాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13, 2024న ఎన్నికలు జరిగాయి. అధికార YSRCP, ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో రాళ్లదాడులు, ఆస్థుల దహనం, దాడులకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. మాచర్ల, గురజాల, తాడిపత్రి నియోజకవర్గాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంతేకాకుండా.. మాచర్లలోని పోలింగ్ బూత్‌లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. మే 21, 2024న పోలీసులు అతనిపై మూడు కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వీవీప్యాట్ యంత్రాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఆయనపై అభియోగాలు మోపారు.
ఈ సంఘటన తర్వాత, గుంతకల్‌కు చెందిన జనసేన నేత మధుసూదన్ గుప్తా ఇటీవల ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కనిపించారనే వాదనతో మరో వీడియో వైరల్ అవుతోంది. “గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా అంట.. దేనికి ఈవీఎం పగలగొట్టాడు! అదేంట్రా నిన్న మన జనసైనిక్స్, పచ్చ హమాస్ రిగ్గింగ్ జరిగితే.. ఈసీ కి పిర్యాదు చేయాలి గాని, ఈవీఎం పగలగొట్టడం ఏంట్రా అని తెగ నీతులు చెప్పారు? #JanasenaParty #TDP #APElections2024” అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. ఈ వీడియో పాతది, 2019 ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ విజువల్స్ 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికలని కనుగొన్నాము. wion.com ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని గుత్తి పట్టణంలోని పోలింగ్ బూత్‌లో జనసేన పార్టీ లోక్‌సభ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈ దాడికి తెగబడ్డారు. ఓటింగ్ ఛాంబర్‌పై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పేర్లు సరిగ్గా చూపించలేదని ఆరోపిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారు. గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుత్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రానికి గుప్తా చేరుకున్నారు. ఆ తర్వాత కోపంతో ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టారు.
india.com కథనం ప్రకారం, గుత్తిలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడానికి వచ్చిన గుప్తా, అసెంబ్లీ- పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లను సరిగ్గా ప్రదర్శించకపోవడంపై పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంను ఎత్తి నేలపై పడేసి పగలగొట్టారు. ఈ ఘటనలో ఈవీఎం దెబ్బతింది. గుప్తాను వెంటనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాబట్టి, వైరల్ వీడియో 2019 నాటిది. మే 13, 2024న జరిగిన పోలింగ్ కు సంబంధించింది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : గుంతకల్లు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ బూత్‌లోని ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Claimed By : Social media users
Fact Check : Misleading