ఫ్యాక్ట్ చెక్: ఆ వైరల్ వీడియోలో ఉన్నది కంప్యూటర్ గ్రాఫిక్స్.. బిపార్జోయ్ తుఫానుకు సంబంధం లేదు
బిపార్జోయ్ తుఫాను ప్రభావం తగ్గింది. కొన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపించినప్పటికీ.. ప్రాణ నష్టం కలగలేదు. బిపార్జోయ్ తుఫాను ఈశాన్య దిశగా కదులుతూ పాకిస్తాన్‌లోని సౌరాష్ట్ర-కచ్ తీరాన్ని దాటి గుజరాత్‌లోని జాఖౌ నౌకాశ్రయానికి దగ్గరగా తీరాన్ని తాకింది.

ఆ సమయంలో సముద్ర తీరంలో సుడిగాలి కనిపించిందని.. గుజరాత్‌లోని కచ్ ఓడరేవు ప్రాంతంలో బిపార్జోయ్ తుఫాను తీరాన్ని తాకుతున్న దృశ్యాలు ఇవని చెబుతూ వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు.
వైరల్ వీడియోపై శీర్షికలో “The visuals of #BiparjoyCyclone making a splash #LANDFALL in a port area, Kutch, Gujarat #BiparjoyUpdate #BiparjoyNews #Gujaratcyclone #cyclone #cyclone” అని ఉంది.
వైరల్ వీడియోపై శీర్షికలో “The visuals of #BiparjoyCyclone making a splash #LANDFALL in a port area, Kutch, Gujarat #BiparjoyUpdate #BiparjoyNews #Gujaratcyclone #cyclone #cyclone” అని ఉంది.
https://www.facebook.com/reel/188981067466281
మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసాం అదే వీడియోని ఫేస్‌బుక్‌లో గుర్తించాం. ‘Shea Gibson – Meteorologist’ అనే ఫేస్ బుక్ వినియోగదారు “Fake microburst Circulation social media again” అంటూ వీడియోను అప్లోడ్ చేశాడు.
“ఈ వీడియో చాలా మంది అది ఏమిటి అని అడుగుతూనే ఉంటారు. ఇది స్పీడ్-అప్ మైక్రోబర్స్ట్ ద్వారా సృష్టించింది. అది కూడా CGIతో అని గుర్తించాం. వాతావరణ శాస్త్ర దృక్కోణం నుండి ఖచ్చితంగా ఇది గందరగోళంగా ఉంటుంది. పేలుడు సంభవించినట్లుగా మైక్రోబర్స్ట్‌లు అన్ని దిశలలో పడిపోతాయి.. ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి ఒక్కటీ నిజం కాదు! అని మీరు గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో CGI (కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ) వీడియో.మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసాం అదే వీడియోని ఫేస్‌బుక్‌లో గుర్తించాం. ‘Shea Gibson – Meteorologist’ అనే ఫేస్ బుక్ వినియోగదారు “Fake microburst Circulation social media again” అంటూ వీడియోను అప్లోడ్ చేశాడు.
“ఈ వీడియో చాలా మంది అది ఏమిటి అని అడుగుతూనే ఉంటారు. ఇది స్పీడ్-అప్ మైక్రోబర్స్ట్ ద్వారా సృష్టించింది. అది కూడా CGIతో అని గుర్తించాం. వాతావరణ శాస్త్ర దృక్కోణం నుండి ఖచ్చితంగా ఇది గందరగోళంగా ఉంటుంది. పేలుడు సంభవించినట్లుగా మైక్రోబర్స్ట్‌లు అన్ని దిశలలో పడిపోతాయి.. ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి ఒక్కటీ నిజం కాదు! అని మీరు గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.
Actu Astro meteo అనే ఛానెల్ లో అప్లోడ్ చేసిన YouTube వీడియోని కూడా మేము కనుగొన్నాము “When the sky meets the @sea” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో జనవరి 2021లో ప్రచురించారు. వీడియో వివరణలో, @orphicframer ద్వారా సృష్టించిన CGI వీడియో అని తెలిపారు.
మేము సోషల్ మీడియాకు సంబంధించిన వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో orphicframer అకౌంట్ కోసం వెతికినప్పుడు, మేము అతని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలను కనుగొన్నాము. అందులో ఈ వీడియో కనిపించింది.
ఈ వీడియో జూన్ 2019లో అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, డిసెంబర్ 2018లో అతని యూట్యూబ్ ఖాతాలో షేర్ చేశారు.
యూట్యూబ్‌లో షేర్ చేయబడిన వీడియో “టోర్నాడో ఇన్ జెర్సీ, ఛానల్ ఐలాండ్స్ (CGI సిమ్యులేషన్) (టిక్‌టాక్) పేరుతో ఉంది. వీడియో వివరణలో ఇది Nikon D7200 50mm 1.8, Adobe ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సినిమా 4Dని ఉపయోగించి రూపొందించామని తెలిపారు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించి పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ పోస్టులను నిజ నిర్ధారణ చేశాయి.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వైరల్ వీడియోలో బిపార్జోయ్ తుఫానుకు సంబంధించినదంటూ పోస్టులు పెడుతున్నారు, ఇది CGI ద్వారా రూపొందించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : video shows visuals of cyclone biparjoy
Claimed By : Social Media Users
Fact Check : False