లేదు, వైరల్ వీడియో కుంటాల జలపాతం సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం కాదు, 2011లో పాతాల్ పాని జలపాతం సమీపంలో జరిగిన సంఘటన
కుంటాల జలపాతం సమీపంలో జరిగిన సంఘటనలో ఒక కుటుంబం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయారంటూ ఒక వీడియో వాట్సాప్‌లో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.
కుంటాల జలపాతం సమీపంలో జరిగిన సంఘటనలో ఒక కుటుంబం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయారంటూ ఒక వీడియో వాట్సాప్‌లో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియోలో కనిపించే సంఘటన తెలంగాణలోని కుంటాల జలపాతం దగ్గర జూలై 2022 లో జరిగిందనే వాదన అబద్దం.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్ లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, వీడియో పాతదని, 2011 లో ఈ సంఘటన ఇండోర్ సమీపంలోని పాతాళపాని లోని జలపాతంలో జరిగిందని తెలుస్తోంది.
టైమ్స్ ఆఫ్ఇండియాలోని నివేదిక ప్రకారం, జూలై 17, 2011న, ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఆనంద విహారయాత్రలో ఉండగా పాతాళపాని జలపాతం లో అకస్మాత్తుగా నీటి ప్రవాహం ఉదృతం కావడంతో కొట్టుకుపోయారు.
ఇండియా టుడే నివేదిక ప్రకారం, కుటుంబ సభ్యులు కలిసి మొదటిసారిగా పిక్నిక్ కోసం వారాంతపు సెలవులలో సందర్శించడానికి వచ్చారు.
300 అడుగుల ఎత్తులో ఉన్న జలపాతం కింద కుటుంబానికి చెందిన ఐదుగురు నిలబడి ఉండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరు నీటిలోకి జారగా, మిగిలిన వారు కూడా బలమైన ప్రవాహంలో పడిపోయారు.
జూలై 18, 2011న ప్రచురించిన ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, కుటుంబ సభ్యులు జలపాతం కింద స్నానం చేస్తుండగా, భారీ వర్షాల కారణంగా వారు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈదుకుంటూ సురక్షితంగా వెళ్లగా, మరో ముగ్గురు నీటిలో మునిగిపోయారని బార్‌గౌడ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి పీఎస్ మారవి తెలిపారు. ఈ రిపోర్ట్‌లో షేర్ చేసిన సంఘటన వీడియోను కూడా మనం చూడవచ్చు.
వైరల్ వీడియో ను చూపించే మరి కొన్ని యూట్యూబ్ లింకులు
https://www.youtube.com/watch?v=sia1SVSivME
https://www.dailymotion.com/video/x6i2sfp
అందువల్ల, వాట్సాప్‌లో షేర్ చేయబడుతున్న వైరల్ వీడియో పాతది, అందులో కనిపించే సంఘటన తెలంగాణలోని కుంటాల జలపాతం దగ్గర జూలై 2022 లో జరిగింది అనే వాదన అబద్దం.