ఫ్యాక్ట్ చెక్: బైపార్జోయ్ తుఫాను కారణంగా వరదల్లో కారు కొట్టుకుపోలేదు
వర్షాలు వచ్చిన సమయంలో ఏవైనా వాగులను దాటడానికి కొందరు తమ వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. వరదల వేగం, లోతు లాంటి విషయాలను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఊహించని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి.
వర్షాలు వచ్చిన సమయంలో ఏవైనా వాగులను దాటడానికి కొందరు తమ వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. వరదల వేగం, లోతు లాంటి విషయాలను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఊహించని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. టూవీలర్లు, కార్లు వంటివి కొట్టుకుపోవడం పలువురు ప్రాణాలు కోల్పోవడం మనం వింటూ ఉంటాం. తాజాగా అలాంటి వాదనతో ఓ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.
రోడ్డుమీద నుండి నీళ్లు ఊహించని విధంగా వేగంతో వెళుతూ ఉండగా.. కొన్ని కార్లను ఆపివేశారు. అయితే ఓ ఎస్.యు.వీ. కారు మాత్రం వాటన్నిటినీ దాటుకుని వెళ్ళిపోయి.. నీటి ప్రవాహంలో చిక్కుకుంటుంది. అలా చిక్కుకున్న కారు ముందుకు కనీసం కదలలేదు. ఆ సమయం కారులో ఉన్న వ్యక్తులు బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రవాహం మరింత ఉధృతం కావడంతో కారు లోతట్టు ప్రాంతంలోకి కొట్టుకుపోతుంది.
ఇటీవల కర్నాటకలోని దండేలి వద్ద బైపోర్‌జోయ్ తుపాను సమయంలో ఈ ప్రమాదం జరిగిందంటూ ఓ వీడియోను పోస్టు చేస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు “#Karnataka”, “#CycloneBiporjoy” అనే హ్యాష్ ట్యాగ్ లను తగిలించారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము స్పానిష్ న్యూస్ వెబ్‌సైట్ Articulo66 లో అదే విజువల్స్‌ను గుర్తించాం. మే 31, 2023 నాటి నివేదిక ప్రకారం, నికరాగ్వాలోని నిండిరీ మునిసిపాలిటీలోని వెరాక్రూజ్‌లోని వల్లే గోథెల్ సెక్టార్‌లో కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అల్బెర్టో యూరియల్ రొమెరో అనే వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి తన వాహనంలో నీటి ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నించాడు, కానీ అనుకున్నది సాధించలేకపోవడంతో అతడు మరణించాడు. లేక్ జోలోటోన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. కొన్ని గంటల తర్వాత అతని మృతదేహం కనుగొన్నారు.ఇతర స్పానిష్ వెబ్ సైట్స్ కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
https://www.youtube.com/shorts/zDs3wCf_7YE
రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా దేశంలో చోటు చేసుకున్న ఈ ఘటనను కర్ణాటక రాష్ట్రానికి లింక్ చేసి కల్పిత కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నారు.
ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన ఘటనకు.. బైపార్జోయ్ తుఫానుకు ఎటువంటి సంబంధం లేదు.

Claim : Car being washed away in Cyclone Biporjoy in Dandeli, Karnataka.
Claimed By : Twitter Users
Fact Check : False