ఫ్యాక్ట్ చెక్: ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు వృద్ధుడిని కొడుతున్న వీడియో ఇటీవలిది కాదు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ వృద్ధుడిపై అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 500 ఎయిర్‌బస్ విమానాల కోసం డీల్ కుదుర్చుకున్న తర్వాత.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఇండిగో ఉద్యోగి ఓ వృద్ధుడిని పట్టుకుని కొడుతున్నట్లు వీడియోలో ఉంది. ఇంకొకతను ఆయనను కిందపడేసి కొడుతున్నాడు.
ఈ వీడియో కింద “ఇండిగో ఫ్లైట్ కు చెందిన సిబ్బంది ఫ్లైట్ దగ్గరకు వెళ్లాలంటే.. బస్సు ఎక్కాలనుకున్న వృద్ధుడితో అసభ్యంగా ప్రవర్తించారు. వారు అతనిని క్రిందికి తోసేశారు. ఈ పోకిరీలకు గుణపాఠం చెప్పే వరకు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా షేర్ చేయండి.” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ వీడియోలో వృద్ధుడు ఎయిర్ పోర్టు లోపల బస్సు ఎక్కే సమయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఇండిగో విమాన సిబ్బంది కలిసి ఆయనను కింద పడేసి.. గొంతు నొక్కడం మనం గమనించవచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:
మేము వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సంఘటన ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. అదే విజువల్స్ అక్టోబర్ 2017లో పలు మీడియా సంస్థలు నివేదించాయి. అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము. హిందూస్థాన్ టైమ్స్ ప్రకారం ప్రయాణీకుడు రాజీవ్ కత్యాల్ ఎయిర్‌లైన్ సిబ్బందితో గొడవకు దిగాడు.. ఆ తర్వాత అతడిని కింద పడేసి అడ్డుకున్నారు.
కత్యాల్ ఒక విషయంపై ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తరువాత అతను వారిని దుర్భాషలాడాడు, కొన్ని నిమిషాలలో అది కాస్తా ఘర్షణకు దారితీసింది.
ఈ మ్యాన్‌హ్యాండ్లింగ్ ఘటనలో ఇండిగో ఉద్యోగి మొంటూ కల్రాను సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగింది. దీనిపై ఎయిర్ లైన్స్ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ మాట్లాడుతూ.. సదరు ప్యాసెంజర్ రెచ్చగొట్టినా ఉద్యోగి సంయమనం పాటించి ఉండాల్సిందని అన్నారు. తమ ఉద్యోగి తరపున క్షమాపణలు చెప్పారు. “ఢిల్లీ విమానాశ్రయంలో మా సిబ్బందితో ప్రయాణీకుడికి ఎదురైన అనుభవానికి చింతిస్తున్నాను. ఆయనకు క్షమాపణలు చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మన సంస్కృతిని ప్రతిబింబించవని చెబుతున్నాను" అని ఆయన అన్నారు.
ఇండిగో సిబ్బంది జూబీ థామస్‌ను మొదట ప్రయాణీకుడు దుర్భాషలాడాడు. కత్యాల్ గొడవను పెద్దదిగా చేయడమే కాకుండా.. ఇండిగో సిబ్బంది చెబుతున్నా పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా మరో ఉద్యోగి కాలర్ పట్టుకుని తోసేయడానికి ప్రయత్నించాడు. దీంతో అది కాస్తా ఘర్షణకు దారితీసింది.
ఈ వివరణ బట్టి.. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకుంది కాదని స్పష్టంగా తెలుస్తోంది.