ఫ్యాక్ట్ చెక్: ది కేరళ స్టోరీ సినిమా చూసి అక్కడి అమ్మాయిల్లో మార్పు వచ్చిందనే కథనాల్లో ఎలాంటి నిజం లేదు.
తెల్లటి సల్వార్ కమీజ్ దుస్తులు ధరించి కాషాయరంగు చున్నీలతో వీధుల్లో వెళుతున్న బాలికల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'ది కేరళ స్టోరీ' చిత్రం విడుదలైన తర్వాత అమ్మాయిల్లో కనిపించిన మార్పు అనే వాదనతో షేర్ చేస్తూ ఉన్నారు.
తెల్లటి సల్వార్ కమీజ్ దుస్తులు ధరించి కాషాయరంగు చున్నీలతో వీధుల్లో వెళుతున్న బాలికల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'ది కేరళ స్టోరీ' చిత్రం విడుదలైన తర్వాత అమ్మాయిల్లో కనిపించిన మార్పు అనే వాదనతో షేర్ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు బైక్‌లు నడుపుతూ, వందలాది మంది కర్రలు పట్టుకుని వీధిలో కవాతు చేస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి.
వీడియోతో పాటు షేర్ చేసిన క్యాప్షన్ “ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత ఇది ఒక మార్పు. మావిల్లికర సిటీ (కేరళ)లో *శౌర్య యాత్ర*లో వేలాది మంది మహిళా కార్యకర్తలతో పాథసంచలన్ *కేరళ దుర్గా వాహిని విభాగం* ఆధ్వర్యంలో నిర్వహించబడింది…” (“This is a change after The Kerala Story Film. In Mavillikara City (Kerala) *Shaurya Yatra* yesterday with thousands of women activists Conducted by Pathasanchalan *Kerala Durga Vahini Section*…”)
'ది కేరళ స్టోరీ' చిత్రం తెచ్చిన మార్పు ఇది అని పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వాదన చాలాసార్లు షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. దుర్గా వాహిని విభాగం నిర్వహించిన పరేడ్‌కి సంబంధించిన వీడియో కేరళకు చెందినది అయినప్పటికీ, ఇది ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రభావం వల్ల వచ్చింది కాదు. ప్రతి ఏటా జరిగే సాధారణ కార్యక్రమం.మేము 'దుర్గా వాహిని కేరళ' అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేశాం.. కేరళలోని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన దుర్గా వాహిని విభాగం నిర్వహించిన పరేడ్‌లకు సంబంధించిన అనేక వీడియోలను మేము కనుగొన్నాము.
దుర్గా వాహిని హిందూ ధర్మం, భారత సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్న హిందూ మహిళల సంస్థ. 1984లో స్థాపించారు. కరసేవ, సత్యాగ్రహం మొదలైన కార్యక్రమాలలో యువతులకు క్రమం తప్పకుండా శిక్షణనిస్తుంది.
వారి వెబ్‌సైట్ ప్రకారం, దుర్గా వాహిని హిందూ యువతుల కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ. ఏ దేశానికైనా బలం లేదా శక్తి కేంద్రం ఆ దేశంలోని యువత. యువశక్తి ఒక్కటే సమాజాన్ని లేదా దేశాన్ని అభ్యుదయ పథంలో నడిపించగలదని దుర్గా వాహిని సంస్థ నమ్ముతుంది. అందులో భాగంగానే అమ్మాయిలకు పలు విషయాలలో శిక్షణను ఇస్తూ ఉంటారు.
వార్తా కథనాల ప్రకారం, కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కీజరూర్ వద్ద ఆయుధాలతో మార్చ్ ను నిర్వహించారనే ఆరోపణలపై దుర్గా వాహినికి చెందిన 200 మందికి పైగా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
onmanorama.com ప్రకారం, మార్చ్ వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుపు, నారింజ రంగు దుపట్టాలు ధరించిన యువతులు భుజాలపై పొడవాటి కర్రలతో కవాతు చేస్తున్నారు. కొన్ని చిత్రాలలో, అమ్మాయిలు కత్తులు పట్టుకుని కనిపించారు. ఈ మార్చ్‌పై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ఫిర్యాదు చేసింది.
అక్టోబరు 2015లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ లో దుర్గా వాహినికి చెందిన అమ్మాయిలు, అదే వేషధారణ, చేతుల్లో పొడవాటి కర్రలతో కవాతు చేస్తున్న దృశ్యాన్ని చూపుతుంది.
Getty Images వంటి స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్‌లలో కూడా అనేక చిత్రాలను చూడవచ్చు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా కలిగించిన మేల్కొలుపు ఫలితమే అమ్మాయిల కవాతు అనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. కొన్నేళ్లుగా ఇలాంటి కవాతులను చురుగ్గా నిర్వహిస్తోంది విశ్వహిందూ పరిషత్ కు దుర్గావాహిని విభాగం. ఎన్నో ఏళ్లుగా ఈ కవాతును నిర్వహిస్తూ వస్తోంది.