ఫ్యాక్ట్ చెక్: రైల్వే స్టేషన్‌లో భారీగా ప్రయాణీకులను చూపుతున్న వైరల్ వీడియో MRPS సమావేశానికి వెళుతున్నారంటూ తప్పుడు వాదనతో ప్రచారం చేశారు

మాదిగ రిజర్వేషన్ సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల నవంబర్ 11, 2023న “SC రిజర్వేషన్ విశ్వరూప మహాసభ” సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.

Update: 2023-11-16 06:28 GMT

Kalyani Railway station

మాదిగ రిజర్వేషన్ సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల నవంబర్ 11, 2023న “SC రిజర్వేషన్ విశ్వరూప మహాసభ” సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. దళితుల (ఎస్సీ) సాధికారత కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రకటించారు.


విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. 2023 దుర్గాపూజ సందర్భంగా కోల్‌కతాలోని కళ్యాణి రైల్వే స్టేషన్‌లో ఈ వీడియో చిత్రీకరించారు.

విశ్వరూప మహాసభ అనే కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్ట్‌లు మాకు కనిపించాయి, నిర్వాహకులు కూడా పలు వీడియోలను పోస్టు చేశారు. అందులో ఎక్కడా కూడా వైరల్ వీడియో కనిపించలేదు.

మేము వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. ఈ వీడియో అక్టోబర్ 25, 2023న “POV = You are at Kalyani” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. hyper_aaadi అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రచురించారు. Durga puja అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వీడియోకు ఉంచారు.

అక్టోబర్ 23, 2023న ప్రచురించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము గమనించాం. “रेलवे स्टेशन पर लाखों यात्रियों की भीड़ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. "Description: || Kalyani to sealdh local train || kolkata durga puja||” అంటూ వివరణ ఇచ్చారు. కళ్యాణి లో లోకల్ ట్రైన్ ఎక్కుతున్న ప్రజలని అందులో చెప్పారు.

ఈ సంవత్సరం దుర్గాపూజ సందర్భంగా కోల్‌కతాలోని కళ్యాణి రైల్వే స్టేషన్‌లో రద్దీని చూపించే మరో వీడియోను కూడా మీరు గమనించవచ్చు.
Full View
నవంబర్ 11, 2023న హైదరాబాద్‌లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు ప్రజలు హైదరాబాద్‌కు వెళుతున్నారని వైరల్ వీడియో గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. 2023 అక్టోబర్‌లో దుర్గాపూజ సందర్భంగా కోల్‌కతాలోని రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రజలకు సంబంధించినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  Thousands of people gathered at the railway station to attend Viswarupa Mahasabha organized by Madiga Reservation Porata Samithi (MRPS)
Claimed By :  Facebook Users
Fact Check :  Misleading
Tags:    

Similar News