ఫ్యాక్ట్ చెక్: ఈ వైరల్ వీడియోకు ఒడిశాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు
జూన్ 2, 2023న ఒడిశాలో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 200కు పైగా మరణించారు, 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా చెబుతున్నారు.;
జూన్ 2, 2023న ఒడిశాలో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 200కు పైగా మరణించారు, 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా చెబుతున్నారు.
ఈ ఘోర ప్రమాదం తర్వాత పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒడిశా ప్రమాదానికి సంబంధించిన వీడియో అంటూ.. రెండు రైళ్లు ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బాలాసోర్‌లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించినదని నెటిజన్లు చెబుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వైరల్ వీడియోకు.. ఒడిశాలోని బాలాసోర్ ప్రమాదానికి సంబంధించినది కాదు.
ఈ వీడియో 2019లో హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించింది.
వైరల్ వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ ప్రమాదానికి సంబంధించి 2019లో ప్రచురించిన అనేక కథనాలను మేము కనుగొన్నాము.
నవంబర్ 2019లో ప్రచురించబడిన వార్తా కథనాల ప్రకారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన యాక్సిడెంట్ ఇదని తెలుస్తోంది. అందుకు సంబంధించిన CCTV ఫుటేజీని ఇది. ది క్వింట్ ప్రచురించిన అటువంటి వీడియోను కూడా మేము కనుక్కున్నాం. ఇక్కడ మనం వైరల్ వీడియోను చూడవచ్చు.
NDTVలోని ఒక నివేదిక ప్రకారం, నవంబర్ 11, 2019న కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొనడంతో 12 మంది గాయపడ్డారు. మాన్యువల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఎంఎంటీఎస్ రైలు, హండ్రీ ఎక్స్‌ప్రెస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి.
రెండు రైళ్లు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నందున, ప్రమాదం తీవ్రత తక్కువగా ఉంది. ఎటువంటి మరణం చోటు చేసుకోలేదు.
https://www.indiatoday.in/
డ్రైవర్‌ను రక్షించినట్లు ఎస్‌సిఆర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. MMTS రైలు సిగ్నల్‌ను ఓవర్‌షాట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత, ఒక రైలును రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన దుర్ఘటనను.. ఈ వైరల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నవంబర్ 2019లో హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌లో చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Video shows recent Odisha train accident
Claimed By : Social Media Users
Fact Check : False