ఫ్యాక్ట్ చెక్: మహా కుంభ మేళా లోని ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం జరుగలేదు

భూమిపై అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం, 45 రోజుల పాటు జరుపుకునే మహాకుంభ మేళా జనవరి 13, 2025న పుష్య పూర్ణిమ నాడు;

Update: 2025-01-13 15:01 GMT

Fire accident mock drill

భూమిపై అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం, 45 రోజుల పాటు జరుపుకునే మహాకుంభ మేళా జనవరి 13, 2025న పుష్య పూర్ణిమ నాడు ప్రారంభమైంది. సాధువులు, సన్యాసులు, ఋషులు కలిసి ఆ పరమేశ్వరునికి ప్రార్థనలు చేసే ప్రదేశం ఇది. సమాజాన్ని ఏక తాటిపై తీసుకురావడం లో కుంభమేళా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చి సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు, అలాగే, పవిత్ర జలాల్లో స్నానం చేస్తారు.

పుష్య పూర్ణిమ నాడు జరిగే మొదటి మంగళ స్నానానికి ఒక రోజు ముందే, అంటే జనవరి 12, 2025న 50 లక్షలకు పైగా భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేశారు. ఈ కార్యక్రమం సురక్షితంగా, చిరస్మరణీయంగా ఉండేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భక్తుల భద్రతను ముఖ్య ఉద్దేశ్యంగా చేసుకొని మహా కుంభ మేళా జరిగే ప్రాంగణంలోని దేవాలయాలు, కీలక ప్రదేశాలలో భద్రతా చర్యలు బలోపేతం చేశారు. మహా కుంభమేళా ప్రాంతం, ప్రయాగ్‌రాజ్, పొరుగు జిల్లాల్లో నిఘా వ్యవస్థలను సక్రియం చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని తనిఖీ చేయడానికి ఎన్నో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ఈ ప్రాంతం అంతటా నిఘా ఉంచడానికి నిఘా బృందాలను కూడా నియమించారు. కుంభమేళాను సనాతన ధర్మంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మార్చడానికి కట్టుబడి ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా అత్యవసర పరిస్థితిని నిర్వహించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇంతలో, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు కలిసి బాధిత ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది, మహా కుంభమేళా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని, దాదాపు 8 మంది పరిస్థితి విషమంగా ఉందని కథనం లో ఉంది.

ఈ కధనంలో ని వాదన హిందీలో ఇలా ఉంది 'महाकुंभ मेला क्षेत्र के हॉस्पिटल में लगी भीषण आग लगभग 8 लोगों की हालत खराब’. అనువదించినప్పుడు, అది ‘మహా కుంభమేళా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, దాదాపు 8 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని పేర్కొంది. ఈ పోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేట్ అవుతోంది.

Full View




క్లెయిం కి చెందిన ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు. 

ఫ్యాక్ట్ చెక్:

ఈ కధనం తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో మహా కుంభ మేళా జరిగే అఖాడా ప్రాంతంలో అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్‌ను చూపిస్తుంది, ఇది నిజమైన సంఘటన కాదు. నిజంగా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగలేదు.

వినియోగదారులు షేర్ చేసిన వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, “భయపడకండి... ఈ సంఘటన కేవలం డెమో మాత్రమే. బృందం ద్వారా అత్యవసర ట్రయల్ నిర్వహించబడింది” అంటూ డిస్క్లైమర్ ను 1.24 నిమిషాలకు చూడవచ్చు.

డిస్క్లైమర్‌ను చూపించే స్క్రీన్‌షాట్ మనం ఇక్కడ చూడొచ్చు.


వీడియో లో ఉన్న కీఫ్రేమ్‌లను తీసుకొని శోధించగా, అదే వీడియో ‘ఆసుపత్రిలో కుంభమేళా అగ్ని ప్రమాదం యొక్క విచారణ #కుంభ్2025లివె #కుంభ్స్నన్ #కుంభ్మెల #షొర్స్’ అనే శీర్షికతో యూట్యూబ్ లో కొన్ని చానళ్లు షేర్ చేసారని తెలుస్తోంది.

Full View

Full View

Free press Journalలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మహాకుంభ మేళా-2025 లో ఏదైనా అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మహాకుంభ్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ, ఐపీఎస్ ఆదేశాలను అనుసరించి, అత్యవసర పరిస్థుతుల్లో సంసిద్ధతను అంచనా వేయడానికి, మెరుగుపరచడానికి థానా అఖారా మహాకుంభమేళా ప్రాంతంలో తెల్లవారుజామున 2:00 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించింది.

మాక్ డ్రిల్‌లో అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి అలారాలనుఏర్పరచడం వంటి విషయాలను అభ్యసించేందుకు అగ్నిమాపక భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. ఈ డ్రిల్ ప్రాథమిక లక్ష్యం, అత్యవసర సమయాల్లో భక్తులకు తొందరగా సేవలను అందించేందుకు అగ్నిమాపక భద్రతా దళాలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ ను నిర్వహించారు.

ANIలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వివిధ అత్యవసర పరిస్థితులను అనుకరిస్తూ, అలారాలు ఏర్పరచడం, వివిధ విధానాలను అమలు చేయడం పై దృష్టి సారించడానికి ఈ వ్యాయామం రూపొందించారు అని తెలుస్తోంది. సకాలంలో రెస్క్యూ, కార్యకలాపాల కోసం అగ్నిమాపక సిబ్బంది మధ్య సమన్వయం ప్రాముఖ్యతను నొక్కి చూపుతూ అగ్నిమాపక సిబ్బంది కి శిక్షణ నిర్వహించారు.

సీనియర్ ఎస్పీ, ఇతర గెజిటెడ్ అధికారులు సహా అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా చూసుకోవడానికి పోలీసులు, అగ్నిమాపక, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాల మధ్య సహకారం ప్రాముఖ్యతను ఈ మాక్ డ్రిల్ నొక్కి వక్కానించింది.

కనుక, వైరల్ వీడియో మహా కుంభమేళా ప్రాంతంలో అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్‌ను చూపిస్తుంది, అంతేకానీ ఇది ఆసుపత్రిలో జరిగిన నిజమైన అగ్నిప్రమాదం కాదు. ఈ వాదన తప్పుదారి పట్టిస్తోంది.

Claim :  వైరల్ వీడియో మహా కుంభమేళాలోని ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్నిప్రమాదాన్ని చూపిస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News