నిజ నిర్ధారణ: MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్న వెబ్‌సైట్‌లు నకిలీవి

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలు. వ్యాపారాలను లాభదాయకంగా ఉండేటట్లు, యజమానులకు ప్రయోజనం చేకూర్చేందుకు MSME మంత్రిత్వ శాఖ అనేక పథకాలు, రాయితీలను అందిస్తుంది.

Update: 2022-09-12 07:00 GMT

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలు. వ్యాపారాలను లాభదాయకంగా ఉండేటట్లు, యజమానులకు ప్రయోజనం చేకూర్చేందుకు MSME మంత్రిత్వ శాఖ అనేక పథకాలు, రాయితీలను అందిస్తుంది.

రిజిస్టర్డ్ MSMEలు కూడా బ్యాంక్ లోన్‌లపై తక్కువ వడ్డీ రేటును పొందుతాయి, ఇది భారీ మార్జిన్‌తో డబ్బు ఆదా చేయడంలో వారికి సహాయపడుతుంది. యజమానులు 1 pc కంటే తక్కువ వడ్డీ రేటుతో,సులభ EMIలతో బ్యాంక్ లోన్‌లను పొందవచ్చు. ఇంకా, నమోదిత యూనిట్లు భారత ప్రభుత్వం నుండి లైసెన్స్‌లు, ధృవపత్రాలను కోరినప్పుడు వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అనేక వెబ్‌సైట్‌లు MSMEలకు సులువుగా నమోదు చేస్తామని వాగ్దానం తో వారి వద్ద ఫీజులు రాబడుతున్నారు. అయితే, ప్రభుత్వం నిర్వహించే నిజమైన వెబ్‌సైట్‌లో MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి ఎటువంటి చార్జీలు లేవు.

MSMEల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని అందిస్తామంటూ క్లెయిం చేస్తున్న కొన్ని లింక్‌లు ఇక్కడ ఉన్నాయి.

Full View

https://eudyogaadhaar.org/

https://msmeregistrar.org/about-us.php

ఆర్కైవ్ లింకు:

https://web.archive.org/web/20220909052419/https://eudyogaadhaar.org/

నిజ నిర్ధారణ:

ఇక్కడ కనిపించే వెబ్‌సైట్‌లు నిజమైన ప్రభుత్వ వెబ్‌సైట్‌లు కావు. అవి నకిలీవి, MSME ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి డబ్బు వసూలు చేస్తున్నాయి, వాస్తవానికి ప్రభుత్వం ఈ సేవ ను ఉచితంగా అందిస్తోంది.

MSME రిజిస్ట్రేషన్ సేవ భారత ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించబడుతుంది. భారత ప్రభుత్వం యొక్క ఏదైనా నమోదిత వెబ్‌సైట్‌లో gov.in పొడిగింపు ఉంటుంది, .org లేదా .com కాదు.

వెబ్‌సైట్ https://eudyogaadhaar.org/ అబౌట్ అస్ (about us) పేజీని తెరిచినప్పుడు, వెబ్‌సైట్ వారు ఐ ఎస్ ఓ సర్టిఫైడ్, ప్రభుత్వ-ఆమోదిత కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడర్ అని, వారి చిరునామా జార్ఖండ్‌లో ఉందని తెలుస్తోంది.

తరువాత, whois.com ని ఉపయోగించి https://eudyogaadhaar.org/ వెబ్‌సైట్ డొమైన్‌ని తనిఖీ చేయగా https://eudyogaadhaar.org/ వెబ్‌సైట్ డొమైన్ అమెరికాలోని అరిజోనాలో నమోదు అయ్యిందనీ, ప్రభుత్వ సర్వర్‌కు చెందినది కాదనీ తెలుస్తోంది.

https://msmeregistrar.org/ డొమైన్ వివరాల కోసం వెతుకుతున్నప్పుడు, అది కూడా అమెరికాలోని అరిజోనాలో కూడా నమోదు అయ్యిందని తెలుస్తోంది.

'MSME రిజిస్ట్రేషన్ + gov.in' అనే కీలక పదాలను తీసుకుని శోధించగా, మేము https://udyamregistration.gov.in/ వెబ్‌సైట్‌ను కనుగొన్నాము.

ఈ వెబ్‌సైట్ నిజమైనదా కాదా అని నిర్ధారించడానికి, మేము whois.com లో డొమైన్ వివరాలను వెతికాము. వెబ్‌సైట్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా రిజిస్టర్ చేయబడిందని, భారతదేశంలోని ఢిల్లీలోని MSME మంత్రిత్వ శాఖ రిజిస్ట్రెంట్ సంస్థ అని తెలుసుకున్నాము. వెబ్‌సైట్‌లోని చిరునామా MSME మంత్రిత్వ శాఖ, ఉద్యోగ్ భవన్, న్యూఢిల్లీ అని ఇవ్వబడింది.

ఈ వెబ్‌సైట్ అసలైనదని, ఇది భారత ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించిన తర్వాత, సైట్‌లో MSMEల రిజిస్ట్రేషన్ ధర కోసం శోధించాము, అయితే, ఈ సేవల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయబడడం లేదని కనుగొన్నాము.

https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm

తదుపరి శోధించినప్పుడు,MSMEలకు రిజిస్ట్రేషన్ అందించడానికి రూ. 2,700 రుసుము తీసుకుంటున్న వెబ్ సైట్ నకిలీదని ధృవీకరిస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ కూడా లభించింది.

https://www.linkedin.com/posts/riteshvsharma_udyam-registrationudyog-aadhar-onlinemsme-activity-6955061382543228928-qT-e/

MSMEల రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్‌ను గతంలో ఉద్యోగ్ ఆధార్ అని పిలిచేవారు, ఇది ఇప్పుడు ఉద్యం రిజిస్ట్రేషన్‌గా మార్చబడింది. ఈ మార్పును దుర్వినియోగం చేస్తూ, కొన్ని వెబ్‌సైట్‌లు MSME సర్టిఫికేట్ అందించడానికి వినియోగదారుల నుండి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

అందువల్ల, MSME రిజిస్ట్రేషన్ ఉచిత సేవ, MSMEలకు రిజిస్ట్రేషన్ సేవలను ధరకు అందజేస్తామని క్లెయిమ్ చేసే వెబ్‌సైట్‌లు నిజమైనవి కావు, నకిలీవి.

Claim :  Websites charging for MSME registration certificates
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News