3 లక్షలు ఇస్తే భీష్మ సినిమాలో ఆఫర్

నితిన్ – ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో మీరు కనిపించాలనుకుంటున్నారా? సినిమాలో ఏదైనా ఒక పాత్ర [more]

Update: 2019-02-04 10:51 GMT

నితిన్ – ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో మీరు కనిపించాలనుకుంటున్నారా? సినిమాలో ఏదైనా ఒక పాత్ర చేయాలనుకుంటున్నారా? అయితే జస్ట్ 3 లక్షలు ఇస్తే చాలు మీకు ఆ అవకాశం వచ్చినట్టే అని గత కొన్ని రోజులు నుండి ఓ వాట్సాప్ గ్రూప్ ప్రత్యక్షమైంది.

అయితే ఈ మ్యాటర్ డైరెక్టర్ వెంకీ కుడుముల వద్దకు వెళ్ళింది. దీనిపైన ఆయన స్పందిస్తూ..భీష్మ సినిమాలో ఆఫర్ ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నాడు. ఆ వాట్సాప్ గ్రూప్ కు సినిమా యూనిట్ తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పాడు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటె చిత్ర యూనిట్ నుండి కాస్టింగ్ కాల్ వస్తుందని చెప్పాడు.

మరి ఇటువంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావట్లేదు అని అన్నాడు. సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఇటువంటి వార్తలు వస్తున్నాయి అని చెప్పాడు. చెన్నై లో వందమంది జూనియర్ ఆర్టిస్టులతో నితిన్ పై ఓ షెడ్యూల్ జరుగుతోందనే వార్తల్ని దర్శకుడు ఖండించాడు. ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే డీటెయిల్స్ ఇస్తాం అని చెప్పాడు.

Tags:    

Similar News