వర్చువల్ భార్యతో ఆరేళ్లు కాపురమట.. ఇలాంటోళ్లు కూడా ఉంటారు!!

2018లో వర్చువల్ క్యారెక్టర్ హాట్సున్ మికుని వివాహం చేసుకున్న జపాన్ వ్యక్తి తన ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని నవంబర్ 4న జరుపుకున్నాడు.

Update: 2024-11-09 02:32 GMT

2018లో వర్చువల్ క్యారెక్టర్ హాట్సున్ మికుని వివాహం చేసుకున్న జపాన్ వ్యక్తి తన ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని నవంబర్ 4న జరుపుకున్నాడు. అకిహికో కొండో, 41, ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వార్షికోత్సవ వేడుకల చిత్రాలను పంచుకున్నారు. “ఈరోజు మా వివాహ వార్షికోత్సవం. 6 సంవత్సరాలు” అంటూ పోస్టు పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని దేశాలలో పెళ్లిళ్లు చేసుకోవాలంటేనే భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో యువత అసలు పెళ్లి చేసుకోడానికే ముందుకు రావడం లేదు. కొందరు బొమ్మలను పెళ్లి చేసుకోగా, ఇంకొందరు ఇలా వర్చువల్ క్యారెక్టర్స్ ను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.

వర్చువల్ భార్య 'హాట్సున్ మికుని' అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ అకిహికో కొండో చెప్పుకొచ్చాడు. సెకండరీ స్కూల్‌లో చేరకముందే తనకు మహిళల పట్ల ఫీలింగ్స్ ఉండేవని కొండో చెప్పాడు. 2007లో కొండో వర్చువల్ పాత్ర మికుతో ప్రేమలో పడ్డాడు. ఇక అతడు చేసే పనిలో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అతడు మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అతడు అనారోగ్యం కారణంగా సెలవు తీసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో 'మికు' స్వరం కొండోను సమాజంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సహాయపడింది. చివరికి అతని ప్రాణాలను కాపాడింది. 2018లో టోక్యోలో ఆమెతో వివాహాన్ని చేసుకున్నాడు. కల్పిత పాత్రల పట్ల లైంగికంగా ఆకర్షితులైన వ్యక్తిగా కొండో నిలిచాడు. ఏది ఏమైనా పెళ్లి చేసుకోడానికి ఇలాంటి వర్చువల్ క్యారెక్టర్ తప్ప ఇంకేమీ దొరకలేదా అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News