Bhukya Yashwant: మరో సాహసం చేసిన భూక్యా యశ్వంత్.. ఈసారి మౌంట్ కాంగ్ యాట్సే 2

తెలంగాణ యువకుడు భూక్యా యశ్వంత్ మరో పర్వతాన్ని అధిరోహించి

Update: 2024-07-15 17:09 GMT

తెలంగాణ యువకుడు భూక్యా యశ్వంత్ మరో పర్వతాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర లిఖించాడు. 6,250 మీటర్ల ఎత్తులో ఉండే మౌంట్ కాంగ్ యాట్సే 2 పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. 8 రోజుల పాటు సాగిన ఈ సాహస యాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. శిఖరాగ్రాన యశ్వంత్ భారత జెండాను సగర్వంగా ప్రదర్శించాడు.ఈ ఘనత తన ఒక్కడితే కాదని.. ప్రతి ఒక్కరికీ చెందుతుందని యశ్వంత్ చెప్పుకొచ్చారు. ఈ మార్గంలో తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా భూక్య తండా మరిపెడలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువ పర్వతారోహకుడు యశ్వంత్ తన అంకితభావం, పట్టుదలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతని పర్వతారోహణ కెరీర్‌లో ఈ శిఖరాగాన్ని చేరుకోవడం మరో మైలురాయిని సూచిస్తుంది. శిఖరాగ్రానికి చేరుకోడానికి చేసిన ప్రయాణం ఎన్నో సవాళ్లతో నిండిందని.. శారీరక దారుఢ్యం మాత్రమే కాదు.. మానసిక స్థితిని కూడా పరీక్షించింది చెప్పుకొచ్చాడు. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ, యశ్వంత్ అచంచలమైన సంకల్పం, పర్వతారోహణ పట్ల అభిరుచి ఈ విజయాన్ని సాధించడానికి కారణమైంది. యశ్వంత్ తన లక్ష్యం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమేనని ఎంతో ధైర్యంగా చెబుతున్నాడు.
దక్షిణాఫ్రికాలో అతిపెద్ద పర్వతంగా పేరొందిన మౌంట్‌ కిలిమంజారోను (5895మీటర్లు), రష్యాలోని మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (5642మీటర్లు), మౌంట్‌ కొసిజ్‌స్కో(2228మీ, ఆస్ట్రేలియా), మౌంట్‌ యునమ్‌ (6100మీ, హిమాచల్‌ ప్రదేశ్‌), మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ (5364మీ) ఇప్పటికే అధిరోహించాడు యశ్వంత్. త్వరలోనే ఎవరెస్టును కూడా అధిరోహిస్తాడని అందరం ఆశిద్దాం.


Tags:    

Similar News